KKR vs CSK Stat Highlights: బ్యాటింగ్‌లో మరోసారి ఘోరంగా విఫలమైన చెన్నై, 10 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఘన విజయం, కోల్‌కతాను గెలిపించిన రాహుల్‌ త్రిపాఠి మెరుపులు

బ్యాటింగ్‌ వైఫల్యంతో ధోనీ సేన మరోసారి ఓడింది. ఐపీఎల్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో (KKR vs CSK Stat Highlights Dream11 IPL 2020) కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) చేతిలో పరాజయం పాలైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొన్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (Kolkata Knight Riders) రాహుల్‌ త్రిపాఠి (51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 81) అర్ధ శతకం చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో చెన్నై(Chennai Super Kings) ఓవర్లన్నీ ఆడి 5 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేసి ఓడింది.

Rahul Tripathi (Photo Credits: Twitter)

బ్యాటింగ్‌ వైఫల్యంతో ధోనీ సేన మరోసారి ఓడింది. ఐపీఎల్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో (KKR vs CSK Stat Highlights Dream11 IPL 2020) కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) చేతిలో పరాజయం పాలైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొన్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (Kolkata Knight Riders) రాహుల్‌ త్రిపాఠి (51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 81) అర్ధ శతకం చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో చెన్నై(Chennai Super Kings) ఓవర్లన్నీ ఆడి 5 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేసి ఓడింది.

చెన్నై బౌలర్లలో బ్రావో (3/37) మూడు వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్‌ కర్ణ్‌ శర్మ (2/25), కర్రాన్‌ (2/26)కు చెరో రెండు వికెట్లు దక్కాయి. ధోనీ నాలుగు క్యాచ్‌లు అందుకున్నాడు. వాట్సన్‌ (40 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 50) హాఫ్‌ సెంచరీ వృథా అయింది. ఇక కొలకతా బౌలర్లో రస్సెల్‌ (1/18), శివమ్‌ మావి (1/32)తోపాటు చక్రవర్తి, నాగర్‌కోటి, నరైన్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు. త్రిపాఠికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది. చెన్నై జట్టులో పీయూష్‌ చావ్లా స్థానంలో కరణ్‌ శర్మను తీసుకోగా... కోల్‌కతా మార్పుల్లేకుండా బరిలోకి దిగింది.

మళ్లీ అగ్రస్థానానికి ముంబై, రాజస్థాన్ రాయల్‌పై 57 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్

కోలకతా ..రాహుల్‌ త్రిపాఠితో ఆట ప్రారంభించిన శుబ్‌మన్‌ గిల్‌ (11), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ నితీశ్‌ రాణా (9), మోర్గాన్‌ (7), రసెల్‌ (2), కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (12) ఇలా స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ చెన్నై బౌలింగ్‌కు బెంబేలెత్తారు. ఒక్కడు మినహా ఇంకెవరూ పట్టుమని 12 బంతులను మించి ఆడలేకపోయారు. మరోవైపు చెన్నై బౌలర్లలో ఒకే ఒక్క బౌలర్‌ (దీపక్‌ చహర్‌) తప్ప బౌలింగ్‌కు దిగిన ప్రతీ ఒక్కరు ప్రత్యర్థిపై ప్రతాపం చూపినవారే! స్యామ్‌ కరన్, శార్దుల్‌ ఠాకూర్, కరణ్‌ శర్మ తలా 2 వికెట్లు తీసి కోల్‌కతాను కట్టడి చేశారు. బ్రేవో అయితే టెయిలెండర్లు కమలేశ్‌(0), శివమ్‌ మావి (0)లను ఖాతానే తెరువనీయలేదు. ఆఖరి ఓవర్లో వాళ్లిద్దరిని ఔట్‌ చేశాడు. వరుణ్‌ చక్రవర్తి రనౌట్‌ కావడంతో బ్రేవో ఇన్నింగ్స్‌ 20వ ఓవర్లో 3 పరుగులే ఇచ్చాడు.

బెంగుళూరును గెలిపించలేకపోయిన కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్, ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఢిల్లీ, 59 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

ఇక టార్గెట్ చేధించేందుకు బరిలోకి దిగిన చైన్నై ఆరంభంలో వాట్సన్, డుప్లెసిస్‌ చకాచకా బౌండరీలు బాదేశారు. డుప్లెసిస్‌ (10 బంతుల్లో 17; 3 ఫోర్లు) వేగానికి శివమ్‌ మావి కళ్లెం వేశాడు. తర్వాత రాయుడు జతకాగా... ఇద్దరు కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు శ్రమించారు. రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించాక రాయుడు (27 బంతుల్లో 30; 3 ఫోర్లు) ఔటయ్యాడు. దీంతో ధోని కాస్త ముందుగా బ్యాటింగ్‌కు దిగాడు. లక్ష్యం దిశగా సాగుతున్నట్లు కనిపించిన సూపర్‌కింగ్స్‌ను నరైన్‌ ఓవర్‌ కలవరపెట్టింది. చాలా ఆలస్యంగా (ఇన్నింగ్స్‌ 12వ) బౌలింగ్‌కు దిగిన నరైన్‌ మొదటి ఓవర్లో 5 పరుగులిచ్చాడు. వాట్సన్‌ 39 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత కాసేపటికే అతన్ని నరైన్‌ ఎల్బీడబ్ల్యూ చేయడంతో కోల్‌కతా ఉత్సాహం రెట్టింపైంది. కానీ నరైన్‌ తర్వాతి ఓవర్‌ను స్యామ్‌ కరన్‌ తేలిగ్గా ఆడేశాడు. 6, 4తో కలిపి మొత్తం 14 పరుగులు రావడంతో చెన్నై శిబిరాన్ని ఆశల్లో నిలిపింది.

ముంబై చేతిలో చిత్తయిన సన్‌రైజర్స్‌, మూడో విజయాన్ని నమోదు చేసిన ముంబై ఇండియన్స్‌, హైదరాబాద్‌ను గెలిపించలేకపోయిన వార్నర్ ఇన్నింగ్స్

ఆఖరి 24 బంతుల్లో 44 పరుగులు చేయాల్సిన తరుణంలో ధోని (11) భారీషాట్లపై దృష్టిపెట్టాడు. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టిన చెన్నై సారథి మరో షాట్‌కు ప్రయత్నించి క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. స్యామ్‌ (17)ను రసెల్‌ ఔట్‌ చేయడంతో చెన్నై లక్ష్యానికి దూరమైంది. చివరి 12 బంతుల్లో 36 పరుగులు చేయాలి. జడేజా (8 బంతుల్లో 21 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), కేదార్‌ జాదవ్‌ (7 నాటౌట్‌) క్రీజులో ఉండగా... 19వ ఓవర్‌ వేసిన నరైన్‌ 10 పరుగులిచ్చాడు. ఇక మిగతా 6 బంతుల్లో 26 పరుగులు ఆ ఇద్దరి వల్లా కాలేదు. రసెల్‌ చివరి ఓవర్లో జడేజా వరుసగా 6, 4, 4 కొట్టగా 15 పరుగులొచ్చాయి.

స్కోరు వివరాలు

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ త్రిపాఠి (సి) వాట్సన్‌ (బి) బ్రేవో 81; గిల్‌ (సి) ధోని (బి) శార్దుల్‌ 11; నితీశ్‌ రాణా (సి) జడేజా (బి) కరణ్‌ శర్మ 9; నరైన్‌ (సి) డుప్లెసిస్‌ (బి) కరణ్‌ శర్మ 17; మోర్గాన్‌ (సి) డుప్లెసిస్‌ (బి) స్యామ్‌ కరన్‌ 7; రసెల్‌ (సి) ధోని (బి) శార్దుల్‌ 2; కార్తీక్‌ (సి) శార్దుల్‌ (బి) స్యామ్‌ కరన్‌ 12; కమిన్స్‌ (నాటౌట్‌) 17; కమలేశ్‌ (సి) డుప్లెసిస్‌ (బి) బ్రేవో 0; శివమ్‌ మావి (సి) ధోని (బి) బ్రేవో 0; వరుణ్‌ (రనౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్‌) 167.

వికెట్ల పతనం: 1–37, 2–70, 3–98, 4–114, 5–128, 6–140, 7–162, 8–163, 9–166, 10–167.

బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 4–0–47–0, స్యామ్‌ కరన్‌ 4–0–26–2, శార్దుల్‌ 4–0–28–2, కరణ్‌ శర్మ 4–0–25–2, బ్రేవో 4–0–37–3.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: వాట్సన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) నరైన్‌ 50; డుప్లెసిస్‌ (సి) కార్తీక్‌ (బి) శివమ్‌ మావి 17; రాయుడు (సి) గిల్‌ (బి) కమలేశ్‌ 30; ధోని (బి) వరుణ్‌ 11; స్యామ్‌ కరన్‌ (సి) మోర్గాన్‌ (బి) రసెల్‌ 17; కేదార్‌ జాదవ్‌ (నాటౌట్‌) 7; రవీంద్ర జడేజా (నాటౌట్‌) 21; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 157.

వికెట్ల పతనం: 1–30, 2–99, 3–101, 4–129, 5–129. బౌలింగ్‌: కమిన్స్‌ 4–0–25–0, శివమ్‌ మావి 3–0–32–1, వరుణ్‌ చక్రవర్తి 4–0–28–1, కమలేశ్‌ 3–0–21–1, నరైన్‌ 4–0–31–1, రసెల్‌ 2–0–18–1.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Hyderabad Horror: నార్సింగిలో జంట హత్యల కేసు, అత్యంత దారుణంగా రేప్ చేసి బండరాయితో చంపేశారని అనుమానాలు, ప్రస్తుతం గుర్తుపట్టలేని స్థితిలో ఇద్దరి మృతదేహాలు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

IND W Vs IRE W: సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా, వన్డేల్లో అత్యధిక స్కోర్‌ చేసి రికార్డు సృష్టించిన మహిళల జట్టు

HMPV Cases in India: భారత్‌లో 18 కి చేరిన హెచ్‌ఎమ్‌పీవీ కేసులు, తాజాగా పుదుచ్ఛేరి మరోచిన్నారి పాజిటివ్, జ్వరం, దగ్గు, జలుబుతో ఆస్పత్రిలో చేరిన పాప

Kiran Kumar Reddy on YSR: వైఎస్ఆర్ బతికి ఉన్నా తెలంగాణ వచ్చి ఉండేది, కొత్త చర్చకు తెరలేపిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మేం తెలంగాణకు అనుకూలం తీర్మానం అసెంబ్లీలో పెట్టాలంటూ..

Share Now