MI vs RR Stat Highlights IPL 2020: మళ్లీ అగ్రస్థానానికి ముంబై, రాజస్థాన్ రాయల్‌పై 57 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్
Jasprit Bumrah celebrates with Rohit Sharma (Photo Credits: PTI)

ఐపీఎల్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మరో విజయాన్ని సాధించింది. రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (MI vs RR Stat Highlights IPL 2020) ముంబై ఇండియన్స్‌ 57 పరుగుల తేడాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాళ్లలో జోస్‌ బట్లర్‌(70; 44 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) మినహా ఎవరు రాణించకపోవడంతో ఓటమి (Mumbai Indians Beat Rajasthan Royals) తప్పలేదు. ముంబై బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు (Jasprit Bumrah Registers his Best Bowling Figures) సాధించగా, ట్రెంట్‌ బౌల్ట్‌, పాటిన్‌సన్‌లు తలో రెండు వికెట్లు తీశారు. రాహుల్‌ చాహర్‌, పొలార్డ్‌లకు తలో వికెట్‌ లభించింది. తాజా విజయంతో ముంబై నాల్గో విజయాన్ని నమోదు చేసుకుని పాయింట్ల పట్టికలో మళ్లీ టాప్‌కు చేరింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ తీసుకోవడంతో ఇన్నింగ్స్‌ను డీకాక్‌, రోహిత్‌ శర్మలు ధాటిగా ఆరంభించారు. డీకాక్‌(23;15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. దాంతో 46 పరుగులు వద్ద ముంబై ఇండియన్స్‌ మొదటి వికెట్‌ పడింది. కార్తీక్‌ త్యాగి బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి డీకాక్‌ పెవిలియన్‌ చేరాడు. అనంతరం రోహిత్‌ శర్మతో కలిసి సూర్యకుమార్‌ యాదవ్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. కాగా, జట్టు స్కోరు 88 పరుగుల వద్ద రోహిత్‌ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. శ్రేయస్‌ గోపాల్‌ బౌలింగ్‌లో రాహుల్‌ తెవాటియా క్యాచ్‌ పట్టడంతో రోహిత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.

బెంగుళూరును గెలిపించలేకపోయిన కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్, ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఢిల్లీ, 59 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

ఆపై వెంటనే ఇషాన్‌ కిషన్‌(0) గోల్డెన్‌ డక్‌గా నిష్ర్కమించాడు. వచ్చీ రావడంతోనే భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌ చేరాడు. అటు తర్వాత వచ్చిన కృనాల్‌(12) పెద్దగా ఆకట్టుకోలేదు. మరొక ఎండ్‌లో సూర్యకుమార్‌ నిలకడగా ఆడటంతో పాటు హార్దిక్‌ పాండ్యా నుంచి సహకారం లభించడంతో ముంబై తిరిగి తేరుకుంది. హార్దిక్‌ పాండ్యా 19 బంతుల్లో 2 ఫోర్లు , 1సిక్స్‌తో 30 పరుగులు చేసి భారీ స్కోరులో సహకరించాడు. రాజస్తాన్‌ బౌలర్లలో శ్రేయస్‌ గోపాల్‌ రెండు వికెట్లు సాధించగా, ఆర్చర్‌, త్యాగిలకు తలో వికెట్‌ దక్కింది. మొత్తంగా నాలుగు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.

ముంబై నిర్దేశించిన 194 పరుగుల టార్గెట్‌లో రాజస్తాన్‌కు ఆదిలో శుభారంభం లభించలేదు. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌(0) డకౌట్‌గా పెవిలియన్‌ చేరగా, స్టీవ్‌ స్మిత్‌(6) తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న సంజూ శాంసన్‌(0) డకౌట్‌ అయ్యాడు. జైస్వాల్‌, శాంసన్‌లను బౌల్ట్‌ ఔట్‌ చేయగా, స్మిత్‌ను బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. దాంతో 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది రాజస్తాన్‌. ఆపై బట్లర్‌ ఒక్కడే పోరాటం చేసినా ఎవరు నుంచి సరైన సహకారం లభించలేదు. చివర్లో ఆర్చర్‌(24;11 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌)కాసేపు మెరుపులు మెరిపించి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు.

స్కోరుబోర్డు

ముంబై ఇండియన్స్‌: డికాక్‌ (సి) బట్లర్‌ (బి) త్యాగి 23; రోహిత్‌ (సి) తెవాటియా (బి) గోపాల్‌ 35; సూర్యకుమార్‌ (నాటౌట్‌) 79; ఇషాన్‌ (సి) శాంసన్‌ (బి) గోపాల్‌ 0; క్రునాల్‌ (సి) గోపాల్‌ (బి) ఆర్చర్‌ 12; హార్దిక్‌ (నాటౌట్‌) 30; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 20 ఓవర్లలో 193/4. వికెట్ల పతనం: 1-49, 2-88, 3-88, 4-117; బౌలింగ్‌: రాజ్‌పుత్‌ 3-0-42-0; శ్రేయాస్‌ గోపాల్‌ 4-0-28-2; ఆర్చర్‌ 4-0-34-1; కార్తీక్‌ త్యాగి 4-0-36-1; టామ్‌ కర్రాన్‌ 3-0-33-0; తెవాటియా 2-0-13-0.

రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వి జైశ్వాల్‌ (సి) డికాక్‌ (బి) బౌల్ట్‌ 0; బట్లర్‌ (సి) పొలార్డ్‌ (బి) ప్యాటిన్సన్‌ 70; స్మిత్‌ (సి) డికాక్‌ (బి) బుమ్రా 6; శాంసన్‌ (సి) రోహిత్‌ (బి) బౌల్ట్‌ 0; మహిపాల్‌ (సి) అనుకుల్‌ రాయ్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 11; టామ్‌ కర్రాన్‌ (సి) హార్దిక్‌ (బి) పొలార్డ్‌ 15; తెవాటియా (బి) బుమ్రా 5; ఆర్చర్‌ (సి) పొలార్డ్‌ (బి) బుమ్రా 24; శ్రేయాస్‌ గోపాల్‌ (సి) డికాక్‌ (బి) బుమ్రా 1; అంకిత్‌ (సి) రోహిత్‌ (బి) ప్యాటినన్‌ 2; కార్తీక్‌ త్యాగి (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 18.1 ఓవర్లలో 136 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-0, 2-7, 3-12, 4-42, 5-98, 6-108, 7-113, 8-115, 9-136; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-26-2; బుమ్రా 4-0-20-4; ప్యాటిన్సన్‌ 3.1-0-19-2; రాహుల్‌ చాహర్‌ 3-0-24-1; క్రునాల్‌ 2-0-22-0; పొలార్డ్‌ 2-0-24-1.