MI vs DC Stat Highlights: వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసిన ముంబై, మూడు మ్యాచుల తరువాత పరాజయాన్ని చవిచూసిన ఢిల్లీ, ఒంటరి పోరాటంతో ఢిల్లీని గెలిపించలేకపోయిన శిఖర్ ధావన్
ఢిల్లీ నిర్దేశించిన 163 పరుగుల టార్గెట్‌ను ముంబై ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే (Mumbai Indians Win by Five Wickets) ఛేదించింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఢిల్లీ మూడు మ్యాచుల తరువాత పరాజయం చవి చూసింది. అయితే ముంబై మాత్రం వరుసగా మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని పాయింట్ల టేబుల్లో అగ్రస్థానానికి చేరింది.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (MI vs DC Stat Highlights Dream11 IPL 2020) ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 163 పరుగుల టార్గెట్‌ను ముంబై ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే (Mumbai Indians Win by Five Wickets) ఛేదించింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఢిల్లీ మూడు మ్యాచుల తరువాత పరాజయం చవి చూసింది. అయితే ముంబై మాత్రం వరుసగా మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని పాయింట్ల టేబుల్లో అగ్రస్థానానికి చేరింది.
ఓపెనర్ రోహిత్ శర్మ(5) వెంటనే అవుటైనా మరో ఓపెనర్ క్వింటన్ డీకాక్(36 బంతుల్లో 53) ఫామ్‌లోకి రావడం ముంబైకి (Mumbai Indians) కలిసొచ్చింది. డీకాక్‌తో పాటు సూర్య కుమార్ యాదవ్(32 బంతుల్లో 53) కూడా అర్థ సెంచరీతో మెరిశాడు. వీరిద్దరికీ తోడు ఇషాన్ కిషన్(15 బంతుల్లో 28) కూడా రాణించడంతో ముంబై విజయానికి చేరువైంది. చివర్లో బర్త్‌డే బాయ్ హార్దిక్ పాండ్యా(0) డకౌట్‌గా వెనుదిరిగినా.. పొలార్డ్(11 బంతుల్లో 11), కృనాల్ పాండ్యా(7 బంతుల్లో 12) లాంచనాన్ని ముగించారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ (Delhi Capitals) నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(42; 33 బంతుల్లో 5 ఫోర్లు), శిఖర్ ధావన్(69 నాటౌట్; 52 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్)లు రాణించడంతో ఢిల్లీ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఢిల్లీ ఆదిలోనే పృథ్వీ షా(4) వికెట్‌ను కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో కృనాల్ పాండ్యా క్యాచ్ పట్టడంతో పృథ్వీ షా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో ధావన్‌కు రహానే జత కలిశాడు. రహానే వచ్చీ రావడంతో మంచి టచ్‌లో కనిపించాడు. రహాన్ మూడు ఫోర్లతో 15 పరుగులు చేసి పెవిలియన్ చేరడంతో ఢిల్లీ 24 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది.
ఆపై ధావన్-అయ్యర్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఈ జోడి 85 పరుగుల జోడించిన తర్వాత అయ్యర్ ఔట్ కాగా, స్టోయినిస్(13) కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో ఉండలేకపోయాడు. ధావన్‌తో సమన్వయం లోపంతో స్టోయినిస్ రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. ధావన్ కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో పాటు అలెక్స్ క్యారీ( 14 నాటౌట్) ఫర్వాలేదనిపించడంతో ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో కృనాల్ పాండ్యా రెండు వికెట్లు సాధించగా, ట్రెంట్ బౌల్ట్‌కు వికెట్ దక్కింది.
స్కోరు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) కృనాల్ (బి) బౌల్ట్ 4; ధావన్ (నాటౌట్) 69; రహానే (ఎల్బీడబ్ల్యూ) (బి) కృనాల్ 15; శ్రేయస్ (సి) బౌల్ట్ (బి) కృనాల్ 42; స్టొయినిస్ (రనౌట్) 13; అలెక్స్ క్యారీ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 162.
వికెట్ల పతనం: 1–4, 2–24, 3–109, 4–130.
బౌలింగ్: బౌల్ట్ 4–0–36–1, ప్యాటిన్సన్ 3–0–37–0, బుమ్రా 4–0–26–0, కృనాల్ 4–0–26–2, పొలార్డ్ 1–0–10–0, చహర్ 4–0–27–0.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) రబడ (బి) అక్షర్ పటేల్ 5; డికాక్ (సి) పృథ్వీ షా (బి) అశ్విన్ 53; సూర్యకుమార్ (సి) శ్రేయస్ (బి) రబడ 53; ఇషాన్ కిషన్ (సి) అక్షర్ పటేల్ (బి) రబడ 28; హార్దిక్ (సి) క్యారీ (బి) స్టొయినిస్ 0; పొలార్డ్ (నాటౌట్) 11; కృనాల్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 166.
వికెట్ల పతనం: 1–31, 2–77, 3–130, 4–130, 5–152.
బౌలింగ్: రబడ 4–0–28–2, నోర్జే 4–0–28–0, అక్షర్ పటేల్ 3–0–24–1, అశ్విన్ 4–0–35–1, హర్షల్ పటేల్ 2–0–20–1, స్టొయినిస్ 2.4–0–31–1.