IPL 2023: ధోనికి చిరాకు తెప్పించిన ఫాస్ట్ బౌలర్లు, ఇలానే ఆడితే నేను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని వార్నింగ్, కొత్త కెప్టెన్ నేతృత్వంలో ఆడాల్సి ఉంటుందని హెచ్చరిక

ఆఖరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో చివరికి చెన్నైదే పైచేయి అయింది

MS Dhoni (Photo credit: Twitter)

MA చిదంబరం స్టేడియంలో Kl రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్‌ను 12 పరుగుల తేడాతో ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023లో మొదటి విజయాన్ని నమోదు చేసింది. ఆఖరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో చివరికి చెన్నైదే పైచేయి అయింది. 12 పరుగుల తేడాతో ధోని సేన గెలుపొందింది. అయితే, ఈ గెలుపు పట్ల సంతోషపడిన ధోని.. తమ బౌలర్ల ఆట తీరుపై మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని తన బౌలర్లకు భారీ వార్నింగ్ ఇచ్చాడు. మా ఫాస్ట్‌ బౌలింగ్‌ విభాగం మరింత మెరుగుపడాల్సి ఉంది. పరిస్థితులను అర్థం చేసుకుంటూ అందుకు అనుగుణంగా బౌలింగ్‌ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. ప్రత్యర్థి బౌలర్లు ఎలాంటి టెక్నిక్స్‌ ఉపయోగిస్తున్నారో కూడా ఓ కన్నేసి ఉంచాలి. నోబాల్స్‌, ఎక్స్‌ట్రా వైడ్స్‌ అస్సలు ఉపేక్షించలేం.ఇది ఇలాగే కొనసాగితే వాళ్లు కొత్త నాయకుడి నేతృత్వంలో ఆడాల్సి ఉంటుంది. ఇది నా సెకండ్‌ వార్నింగ్‌’’ అంటూ పేసర్లను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక వికెట్‌ తమను పూర్తిగా ఆశ్చర్యపరిచిందన్న ధోని.. స్లోగా ఉంటుందనుకుంటే.. పరుగుల వరద పారిందని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో దీపక్‌ చహర్‌ తన కోటా పూర్తి చేసి 55 పరుగులు ఇవ్వగా.. తుషార్‌ 45 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు.

ఐపీఎల్ లో సంచలన విజయంతో చెన్నై బోణీ, ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్‌ ఓటమిపాలైంది

ఎంఏ చిదంబరం స్టేడియంలోని పిచ్ చూసి ధోనీ కూడా ఆశ్చర్యపోయాడు. "ఇది అద్భుతమైన ఆట, అత్యధిక స్కోరింగ్ గేమ్. వికెట్ ఎలా ఉంటుందో అందరం ఆలోచిస్తున్నాం. మాకు ఆ సందేహం వచ్చింది. ఇది అధిక స్కోరింగ్ గేమ్. మొత్తం మీద ఇది జరిగిన మొదటి గేమ్ అని నేను భావిస్తున్నాను. ఇది మేము ఇక్కడకు వచ్చినప్పటి నుండి 5 లేదా 6 సంవత్సరాలలో మొదటి గేమ్‌కు పూర్తి హౌస్‌ని పూర్తి చేసాము" అని ధోని చెప్పాడు.

నాలుగేళ్ల తర్వాత సొంత మైదానంలో మ్యాచ్‌.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో లక్నో..ఓపెనర్‌ కైల్‌ మయేర్స్‌ (22 బంతుల్లో 53; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చినా.. మిడిలార్డర్‌ విఫలమవడంతో 205/7 వద్ద తన ఇన్నింగ్స్ ను ముగించింది.