CWC-23 Semi Finals Chances: పాకిస్థాన్, ఆఫ్ఘన్, న్యూజీలాండ్ జట్లకు సెమీ ఫైనల్ అవకాశాలు, ఫోర్త్ ప్లేస్ కోసం పోటీ పడుతున్న టీమ్స్ ఇవే! ఇంతకు సెమీస్ కు వెళ్లాలంటే ఎవరికీ ఎక్కువ అవకాశం ఉందంటే?

అయితే, సౌతాఫ్రికా ఈనెల 10న అఫ్గానిస్థాన్ జట్టుతో తలపడుతుంది. ఆస్ట్రేలియా మరో మ్యాచ్ ఈనెల 11న బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. ఒకవేళ అఫ్గాన్ జట్టుపై సౌతాఫ్రికా ఓడిపోయి, బంగ్లాపై ఆస్ట్రేలియా విజయం సాధిస్తే రెండో ప్లేస్ లోకి ఆస్ట్రేలియా వెళ్తుంది.

ICC-Cricket-World-Cup-2023-logo

New Delhi, NOV 08: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 (CWC-23) టోర్నమెంట్ లో ఆస్ట్రేలియా(Australia), అఫ్గానిస్థాన్ జట్ల మధ్య ఉత్కంఠ పోరు కొనసాగింది. ఈ మ్యాచ్ లో అఫ్గాన్ (Afghanistan) జట్టు దాదాపు గెలుపు గుమ్మం వరకు చేరింది. కానీ, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్‌ మాక్స్‌వెల్ (Maxwell) బ్యాట్ తో వీరవిహారం చేయడంతో అఫ్గాన్ జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మాక్స్‌వెల్ ఒంటరిపోరాటం చేసి ఆసీస్ కు అద్భుత విజయాన్ని అందించాడు. 128 బంతులు ఎదుర్కొని 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 201 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అఫ్గాన్ పై గెలుపుతో ఆసీస్ 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంకు చేరుకుంది. ఫలితంగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్ లు ఆడిన టీమిండియా అన్నింటిల్లోనూ విజయం సాధించింది. దీంతో 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరో మ్యాచ్ ఈనెల 12న నెదర్లాండ్స్ తో తలపడుతుంది. రెండో స్థానంలో ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఉంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఎనిమిది మ్యాచ్ లుఆడి ఆరు మ్యాచ్ లలో విజయం సాధించడంతో 12 పాయింట్లతో ఉన్నాయి. కానీ రన్ రేట్ ప్రకారం సఫారీ జట్టు ముందంజలో ఉంది.

Glenn Maxwell Double Century Video: గ్లెన్‌ మాక్స్‌వెల్‌ డబుల్ సెంచరీ వీడియో ఇదిగో, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ విధ్వంసానికి వణికిన ఆఫ్ఘన్‌ బౌలర్లు

అయితే, సౌతాఫ్రికా ఈనెల 10న అఫ్గానిస్థాన్ జట్టుతో తలపడుతుంది. ఆస్ట్రేలియా మరో మ్యాచ్ ఈనెల 11న బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. ఒకవేళ అఫ్గాన్ జట్టుపై సౌతాఫ్రికా ఓడిపోయి, బంగ్లాపై ఆస్ట్రేలియా విజయం సాధిస్తే రెండో ప్లేస్ లోకి ఆస్ట్రేలియా వెళ్తుంది. ఒకవేళ రెండు జట్లు తమ ప్రత్యర్థి జట్లపై విజయం సాధిస్తే రన్ రేట్ ప్రకారం రెండు మూడు స్థానాల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలు నిలిచే అవకాశం ఉంది.ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్ ఓటమితో ఫోర్త్ ప్లేస్ కోసం మూడు జట్ల మధ్య పోరాటం రసవత్తరంగా మారింది. ఆస్ట్రేలియాపై అఫ్గాన్ జట్టు ఓడినప్పటికీ ఆ జట్టుకు సెమీస్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

AUS vs AFG CWC 2023: గ్లెన్‌ మాక్స్‌వెల్‌ డేంజరస్ బ్యాటింగ్ దెబ్బకి వణికిన ఆప్ఘనిస్తాన్ బౌలర్లు, ఆఫ్ఘన్ ఆశలన్నీ బుగ్గిపాలు చేస్తూ సెమీస్ చేరిన ఆస్ట్రేలియా

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో నాల్గో స్థానంలో న్యూజిలాండ్, ఐదో స్థానంలో పాకిస్థాన్(Pakistan), ఆరో స్థానంలో అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి. న్యూజిలాండ్ జట్టు శ్రీలంకతో, పాకిస్థాన్ జట్టు ఇంగ్లాండ్ తో, అఫ్గానిస్థాన్ జట్టు దక్షిణాఫ్రికాతో తలపడతాయి. ఒకవేళ ఈ మూడు జట్లు ప్రత్యర్థి జట్లపై ఓడిపోతే రన్ రేట్ ప్రకారం ఫోర్త్ ప్లేస్ లోకి వచ్చే జట్టును నిర్ణయించబడుతుంది. ఒకవేళ మూడు జట్లు ప్రత్యర్థి జట్లపై విజయం సాధించినా రన్ రేట్ ప్రకారం నాల్గో స్థానంలో సెమీస్ కు వెళ్లే జట్టు నిర్ణయించబడుతుంది. అఫ్గాన్, న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లలో ఒక్క జట్టు మాత్రమే గెలిచి మిగిలిన జట్లు ఓడిపోతే మినహా.. నాల్గో స్థానంలో సెమీస్ కు వెళ్లే జట్టును రన్ రేట్ ద్వారా నిర్ణయించడం తప్పనిసరి అవుతుంది.



సంబంధిత వార్తలు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..

TS Inter Exam Schedule 2025: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇదిగో, మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్‌ పరీక్షలు, ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్‌

CM Chandrababu Polavaram Visit Updates: పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లు, 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపిన సీఎం చంద్రబాబు