New Zealand Women Defeats India Women: రెండో వ‌న్డేలో 76 ప‌రుగుల తేడాతో న్యూజిలాండ్ విజ‌యం, ఆల్ రౌండ్ ప్ర‌తిభ‌తో అద‌ర‌గొట్టిన‌ సోఫీ డివైన్‌, సిరీస్ 1-1 తో స‌మం

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది.

New Zealand Women (Photo Credits: @WHITE_FERNS/X)

Ahmadabad, OCT 27: అహ్మదాబాద్‌ వేదికగా భారత మహిళల క్రికెట్‌ జట్టుతో ​ఇవాళ జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్‌ 78 పరుగుల తేడాతో గెలుపొందింది (New Zealand Women Defeats India Women). ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. సూజీ బేట్స్‌ (58), కెప్టెన్‌ సోఫీ డివైన్‌ (79) (Sophie Devine) అర్ద సెంచరీలతో రాణించగా.. జార్జియా ప్లిమ్మర్‌ (41), మ్యాడీ గ్రీన్‌ (42) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో రాధా యాదవ్‌ నాలుగు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ రెండు, ప్రియా మిశ్రా, సైమా ఠాకోర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

New Zealand Women Defeat India Women by 76 Runs

అనంతరం 260 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌ 47.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. కివీస్‌ బౌలర్లు లియా తహుహు, సోఫీ డివైన్‌ తలో మూడు వికెట్లు.. ఏడెన్‌ కార్సన్‌, జెస్‌ కెర్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాశించారు. భారత ఇన్నింగ్స్‌లో రాధా యాదవ్‌ (48) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. షెఫాలీ వర్మ 11, స్మృతి మంధన 0, యస్తికా భాటియా 12, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 24, జెమీమా రోడ్రిగెజ్‌ 17, తేజల్‌ హసబ్నిస్‌ 15, దీప్తి శర్మ 15, అరుంధతి రెడ్డి 2, సైమా ఠాకోర్‌ 29 పరుగులు చేసి ఔటయ్యారు. 

India vs New Zealand 2nd Test: రెండో టెస్టులోనూ టీమిండియా ఓటమి,113 పరుగుల తేడాతో గెలుపొందిన న్యూజిలాండ్, సిరీస్ కైవసం చేసుకున్న కివీస్ 

కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో వన్డేలో న్యూజిలాండ్‌ గెలుపుతో 1-1తో సిరీస్‌ సమం అయ్యింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే ఇదే అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 29న జరుగనుంది.