Saba Karim: విరాట్ కోహ్లీని అందుకే సాగనంపారు, సంచలన వ్యాఖ్యలు చేసిన భారత మాజీ క్రికెటర్ సాబా కరీం, రోహిత్‌ని పూర్తిస్థాయి టీ20 కెప్టెన్‌గా నియమించిన బీసీసీఐ
దీంతో కెప్టెన్‌గా వన్డేల్లో విరాట్ కోహ్లి శకం (Virat Kohli has been sacked as ODI captain ) ముగిసింది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు సాబా కరీం అసక్తికర వాఖ్యలు చేశాడు.
టీమిండియా వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని తొలగిస్తూ రోహిత్ శర్మను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కెప్టెన్‌గా వన్డేల్లో విరాట్ కోహ్లి శకం (Virat Kohli has been sacked as ODI captain ) ముగిసింది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు సాబా కరీం అసక్తికర వాఖ్యలు చేశాడు. టీ20 క్రికెట్‌లో భారత కెప్టెన్సీ నుంచి తప్పకున్న కోహ్లి, వన్డేల్లో సారధిగా కొనసాగాలని భావించాడని తెలిపాడు. అయితే ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలవలేకపోవడమే కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తొలగించడానికి ప్రాధాన కారణమని మాజీ క్రికెటర్ కరీమ్ (former Indian cricketer Saba Karim) అభిప్రాయపడ్డాడు.
"నిజం చెప్పాలంటే కోహ్లి ఉద్వాసనకు గురయ్యాడు. టీ20 కెప్టెన్సీ భాధ్యతలనుంచి తప్పుకున్నప్పడు.. వన్డే కెప్టెన్సీ గురించి కోహ్లి ఎటువంటి ప్రకటన చేయలేదు. దీనర్థం అతను వన్డే కెప్టెన్‌గా కొనసాగాలని భావించాడు. కానీ కోహ్లి సారథ్యంలో ఇంతవరకు భారత్ ఒక్క ఐసీసీ ట్రోఫి కూడా గెలవలేదు. ఇదే అతడి కెప్టెన్సీను కోల్పోవడానికి ప్రధాన కారణమైందని సబా కరీమ్ పేర్కొన్నాడు. భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) లేదా బీసీసీఐకి చెందిన ఏదైనా అధికారి కోహ్లితో కెప్టెన్సీ గురించి మాట్లాడి ఉంటారని సబా కరీమ్ అభిప్రాయపడ్డాడు.
ద్రవిడ్ కోహ్లితో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని కరీం తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా అంతకు ముందు భారత టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లీ బాధ్యతల నుంచి వైదొలగాలని నిర్ణయించుకోవడంతో రోహిత్‌ని పూర్తిస్థాయి టీ20 కెప్టెన్‌గా నియమించారు.