New Delhi December 08: విరాట్ కోహ్లీకి షాక్ ఇచ్చింది బీసీసీఐ. టీమిండియా వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించింది. ఈ మేరకు భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ నిర్ణయింది. దీంతో విరాట్ కోహ్లీ కేవలం టెస్టులకు మాత్రమే కెప్టెన్ గా పరిమితం కానున్నారు. ఇక నుంచి జరిగే అన్ని సిరీసుల్లోనూ వన్డే, టీ20 జట్లకు రోహితే సారధ్యం వహిస్తాడని బీసీసీఐ ప్రకటించింది. ఈ ప్రకటనతో సౌతాఫ్రికా సిరీస్‌లో జరిగే మూడు వన్డే మ్యాచుల్లో భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
The All-India Senior Selection Committee also decided to name Mr Rohit Sharma as the Captain of the ODI & T20I teams going forward.#TeamIndia | @ImRo45 pic.twitter.com/hcg92sPtCa
— BCCI (@BCCI) December 8, 2021
ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ తర్వాత భారత టీ20 జట్టు సారధ్యానికి విరాట్ కోహ్లీ వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలోనే న్యూజిల్యాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారతజట్టుకు రోహిత్ శర్మ సారధ్యం వహించాడు. ఇప్పుడు వన్డే జట్టుకు కూడా రోహిత్ శర్మనే సారధిగా నియమిస్తూ బీసీసీఐ సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో కోహ్లీ అభిమానులు షాక్ కు గురయ్యారు.