Asia Cup 2022: వైరల్ వీడియో, ఆఫ్ఘాన్ బౌలర్‌ని బ్యాట్‌తో కొట్టబోయిన పాక్ ఆటగాడు ఆసిఫ్‌ అలీ, అతన్ని రెచ్చగొట్టిన ఆఫ్ఘన్‌ బౌలర్‌ ఫరీద్‌ అహ్మద్‌

ఆ తర్వాతి బంతికే ఔటయ్యానన్న కోపంతో ఆఫ్ఘన్‌ బౌలర్‌ ఫరీద్‌ అహ్మద్‌ను బ్యాట్‌తో కొట్టబోయాడు. ఇందులో ఫరీద్‌ తప్పు కూడా ఉంది.

Pakistan's Asif Ali Almost Hits Afghanistan Bowler

ఆసియా కప్‌ 2022 సూపర్‌-4 దశలో పాకిస్తాన్..ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ సమరంలో పాకిస్తాన్‌ వికెట్‌ తేడాతో గట్టెక్కిన సంగతి విదితమే. పాక్‌ పదో నంబర్‌ ఆటగాడు నసీమ్‌ షా.. ఆఖరి ఓవర్‌ తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి దాయాది దేశానికి అపురూప విజయాన్ని అందించాడు.

ఇదిలా ఉంటే 19వ ఓవర్ నాలుగో బంతికి సిక్సర్‌ బాది జోరుమీదున్న పాక్‌ బ్యాటర్‌ ఆసిఫ్‌ అలీ.. ఆ తర్వాతి బంతికే ఔటయ్యానన్న కోపంతో ఆఫ్ఘన్‌ బౌలర్‌ ఫరీద్‌ అహ్మద్‌ను బ్యాట్‌తో కొట్టబోయాడు. ఇందులో ఫరీద్‌ తప్పు కూడా ఉంది. ఆసిఫ్‌ను ఔట్‌ చేశానన్న ఆనందంలో ఫరీద్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ అత్యుత్సాహం ప్రదర్శించాడు.

Here's Video

దీంతో కోపం ఆపుకోలేక పోయిన ఆసిఫ్‌ అలీ.. ఫరీద్‌పై బ్యాట్‌తో దాడి చేయబోయాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్రికెట్‌ అభిమానులు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు

 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif