FIFA World Cup 2022: ఫిఫా ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్, ఆ ప్రాంతంలో బీర్ల అమ్మకంపై ఆంక్షలు, సడెన్‌గా నిర్ణయం తీసుకున్న ఆతిథ్య దేశం
ఖతార్ దేశంతో ఈ సంస్థ ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్యాన్స్ ఉండే ప్రదేశాలు, స్టేడియాల పరిసరాల్లో బీర్లు అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. కానీ, తాజాగా అక్కడి అధికారయంత్రాంగం ఉన్నట్లుండి బీర్ల అమ్మకాలపై నిషేధం విధించింది.
Qatar, NOV 18: ఫుట్‌బాల్ (Football)(అభిమానులు ఎదురు చూస్తున్న ‘ఫిఫా వరల్డ్ కప్-2022’ (FIFA)ఆదివారం నుంచి ఖతార్‌లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఖతార్ ప్రభుత్వం దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌లు జరిగే స్టేడియం పరిసరాల్లో బీర్ల అమ్మకాలపై నిషేధం విధించింది. మొత్తం ఎనిమిది స్టేడియాల్లో మ్యాచ్‌లు జరగనుండగా, వీటన్నింటి పరిసరాల్లో బీర్ల అమ్మకాలపై నిషేధం విధించింది. నిజానికి ఖతార్ (Qatar) ఇస్లామిక్ దేశం. ఇక్కడ ఆల్కహాల్ తాగాడాన్ని ప్రభుత్వం ప్రోత్సహించదు. పరిమితంగా మాత్రమే అనుమతిస్తుంది. ఆతిథ్య దేశమైన ఖతార్, ఫిఫా నిర్వహణ కమిటీతో జరిపిన చర్చల అనంతరమే బీర్ల (beer sales) అమ్మకాలపై నిషేధం విధించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఫిఫా ప్రకటించింది. బీర్లతోపాటు ఇతర ఆల్కహాల్ డ్రింక్స్ కూడా అమ్మడంపై నిషేధం ఉంది.
అయితే, ప్రస్తుతం ఈ టోర్నీకి అతిపెద్ద స్పాన్సరర్‌గా ఉంది బీర్ తయారీ సంస్థ ‘బడ్వైజర్’. ఖతార్ దేశంతో ఈ సంస్థ ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్యాన్స్ ఉండే ప్రదేశాలు, స్టేడియాల పరిసరాల్లో బీర్లు అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. కానీ, తాజాగా అక్కడి అధికారయంత్రాంగం ఉన్నట్లుండి బీర్ల అమ్మకాలపై నిషేధం విధించింది.
అలాగే సెల్లింగ్ పాయింట్స్‌ను దూరంగా ఉండే ప్రదేశాలకు తరలించింది. ఈ నిర్ణయంపై ‘బడ్వైజర్’ సంస్థ కోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ఖతార్ ప్రభుత్వం, ‘బడ్వైజర్’ సంస్థ మధ్య జరిగిన మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ నెల 20, ఆదివారం ప్రారంభం కానున్న టోర్నీ డిసెంబర్ 18 వరకు జరుగుతుంది.