FIFA WC 2022: ఫిఫాలో మరోసారి ఫైనల్‌కు చేరిన ఫ్రాన్స్, రెండో సెమీస్‌లో మొరాకోను చిత్తు చేసిన డిఫెండింగ్ ఛాంపియన్, ఆదివారం జరుగనున్న ఫైనల్ మ్యాచ్‌కోసం సర్వం సిద్ధం

ఫిఫా ప్రపంచ కప్‌-2022లో మూడో స్థానం కోసం శనివారం మొరాకో-క్రొయేషియా తలపడతాయి. కాగా, మొరాకోపై గెలిచి ఫైనల్ లోకి ప్రవేశించడంతో ఫ్రాన్స్ లో అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. 2018 ప్రపంచ కప్ ను ఫ్రాన్స్ గెలుచుకుంది. ఆ సమయంలో క్రొయేషియా రన్నరప్ గా నిలిచింది.

FIFA WC 2022: ఫిఫాలో మరోసారి ఫైనల్‌కు చేరిన ఫ్రాన్స్, రెండో సెమీస్‌లో మొరాకోను చిత్తు చేసిన డిఫెండింగ్ ఛాంపియన్, ఆదివారం జరుగనున్న ఫైనల్ మ్యాచ్‌కోసం సర్వం సిద్ధం
France vs Morocco (Photo Credit: FIFA World Cup/ Twitter)

Qatar, DEC 15: ఫిఫా వరల్డ్ కప్‌ లో ఫైనలిస్టులు (FIFA World Cup) ఖరారయ్యారు. రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్  (France) ఘన విజయం సాధించింది. మొరాకోతో (Morocco) జరిగిన మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు చేరింది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచులో అర్జెంటీనాతో ఫ్రాన్స్ తలపడనుంది. ఇప్పటికే మొదటి సెమీఫైనల్ మ్యాచులో క్రొయేషియాపై అర్జెంటీనా గెలిచి ఫైనల్ చేరింది. ఫ్రాన్స్-మొరాకో మ్యాచ్ లో ఫ్రాన్స్ ఆటగాళ్లు హెర్నాండెజ్, రాండల్ ధాటిగా ఆడడంతో ఆ జట్టు 2 గోల్స్ సాధించగా, మొరాకో ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. ఫ్రాన్స్ జట్టు వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది. క్వార్టర్ ఫైనల్లో అద్భుతంగా రాణించి సెమీఫైనల్ కు చేరిన మొరాకో ఈ మ్యాచులో మాత్రం రాణించలేకపోయింది.

ఫిఫా ప్రపంచ కప్‌-2022లో మూడో స్థానం కోసం శనివారం మొరాకో-క్రొయేషియా తలపడతాయి. కాగా, మొరాకోపై గెలిచి ఫైనల్ లోకి ప్రవేశించడంతో ఫ్రాన్స్ లో అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. 2018 ప్రపంచ కప్ ను ఫ్రాన్స్ గెలుచుకుంది. ఆ సమయంలో క్రొయేషియా రన్నరప్ గా నిలిచింది.

Lionel Messi Retirement: లియోనల్‌ మెస్సీ రిటైర్మెంట్‌పై సంచలన ప్రకటన, డిసెంబర్ 18న జరగబోయే ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ తన చివరి మ్యాచ్ అని వెల్లడి 

ఇప్పటివరకు ఫ్రాన్స్ మొత్తం ఫ్రాన్స్ రెండు సార్లు, అర్జెంటీనా రెండు సార్లు ప్రపంచ కప్ సాధించాయి. లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా బలమైన జట్టుగా ఉంది. ఫ్రాన్స్ ఈ ప్రపంచ కప్ లో మొదటి నుంచీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. ముందుగా ఊహించనట్లే అర్జెంటీనా-ఫ్రాన్స్ ఫైనల్ కు వెళ్లాయి. 1986 ప్రపంచ కప్ ఫైనల్లో అర్జెంటీనా విజయం సాధించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మరోసారి ప్రపంచ కప్ గెలుచుకోలేదు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)



సంబంధిత వార్తలు

Human Calculator Kid: ఒకటి కాదు రెండు కాదు ఆరు గిన్నిస్‌ రికార్డులు.. అదీ ఒక్కరోజులోనే.. మహారాష్ట్ర 14 ఏండ్ల బాలుడి ఘనత

ICC Champions Trophy 2025 All Squads: ఈ సారి భారత్ విజేతగా నిలబడుతుందా ఈ జట్టుతో.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ‌లో పాల్గొనే అన్నిజట్ల ఆటగాళ్లు జాబితా ఇదిగో

Top 10 Powerful Countries in World 2025: ఫోర్బ్స్‌ టాప్ టెన్ శక్తిమంతమైన దేశాల జాబితా ఇదిగో, 12వ స్థానంలో నిలిచిన భారత్

Ganesh Jayanti Wishes, Messages, Quotes: నేడు గణేశ్ జయంతి సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి ఇలా..

Share Us