అర్జెంటీనా దిగ్గజం లియోనల్‌ మెస్సీ తన రిటైర్మెంట్‌పై సంచలన ప్రకటన చేశాడు. ఖతర్‌ వేదికగా జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ అర్జెంటీనా తరపున చివరిదని స్పష్టం చేశాడు. మంగళవారం అర్థరాత్రి దాటాకా క్రొయేషియాతో జరిగిన సెమీఫైనల్లో అర్జెంటీనా 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి అర్జెంటీనాకు తొలి గోల్‌ అందించాడు. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లో మెస్సీకి ఇది నాలుగో గోల్‌. మొరాకో, ఫ్రాన్స్‌లలో గెలిచే జట్టుతో డిసెంబర్‌ 18న జరిగే ఫైనల్లో అర్జెంటీనా అమితుమీ తేల్చుకోనుంది.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)