Tokyo Olympics 2021: జపాన్ దేశాన్ని వణికిస్తున్న కరోనా, ఒలింపిక్స్ 2021 నిర్వహణపై కమ్ముకున్న నీలినీడలు, జులై 23 నుంచి ఆగస్టు 8 వరకూ టోక్యో వేదికగా గేమ్స్, ప్రేక్షకుల్లేకుండానే ఒలింపిక్స్‌ నిర్వహించేందుకు కసరత్తు

జపాన్‌లో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు ఒలంపిక్స్ నిర్వహకుల్లో (Tokyo Olympics 2021) ఆందోళన కలిగిస్తున్నాయి. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకూ టోక్యో వేదికగా జరుగనున్న విశ్వక్రీడల నేపథ్యంలో (Tokyo Olympics 2021) అనేక దేశాల నుంచి వేల సంఖ్యలో క్రీడాకారులు నగరానికి చేరుకోనున్నారు.

Tokyo Olympics Banner (Photo Credits: Twitter)

Tokyo, July 3: ఒలింపిక్స్ 2021 నిర్వహణపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. జపాన్‌లో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు ఒలంపిక్స్ నిర్వహకుల్లో (Tokyo Olympics 2021) ఆందోళన కలిగిస్తున్నాయి. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకూ టోక్యో వేదికగా జరుగనున్న విశ్వక్రీడల నేపథ్యంలో (Tokyo Olympics 2021) అనేక దేశాల నుంచి వేల సంఖ్యలో క్రీడాకారులు నగరానికి చేరుకోనున్నారు. దీంతో వైరస్‌ వ్యాప్తి మరింత వేగవంతంగా జరిగే ఆస్కారం ఉండడంతో అక్కడి ప్రభుత్వం ఆందోళన చెందుతుంది.

అవసరమైతే ప్రేక్షకుల్లేకుండానే ఒలింపిక్స్‌ను నిర్వహిస్తామని జపాన్‌ ప్రధాని యోషిహిదే సుగా (Japan PM Yoshihide Suga) వెల్లడించారు. కాగా, గత నెలలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పదివేల మంది ప్రేక్షకులకు అనుమతిస్తామని నిర్వహకులు తెలిపారు. అయితే, నాటి నుంచి కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. రోజుకి సగటున 500 వరకూ నమోదైన కేసులు.. గత రెండు రోజుల క్రితం నుంచి 1500 దాటుతున్నాయి. నిన్న ఒక్కరోజే దేశంలో 1821 కేసులు నమోదవగా.. ఇందులో టోక్యోలో నమోదైనవే 714 కేసులు కావడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.

బెల్జియంకు దిమ్మదిరిగే షాక్, యూరో 2020 ఫుట్‌బాల్‌లో సెమిస్ కు దూసుకెళ్లిన ఇటలీ, స్విట్జ‌ర్లాండ్‌పై గెలిచి ఫైనల్ బెర్త్ కోసం ఇటలీతో తలపడనున్న స్పెయిన్

దీంతో ఒలింపిక్స్ నిర్వహణ కత్తి మీద సాములా మారింది. మరోవైపు టోక్యోతో పాటు ఇతర ప్రాంతాల్లో అంటువ్యాధులు వ్యాపిస్తుండడంతో ప్రభుత్వం నివారణ చర్యల్లో నిమగ్నమైంది. కాగా గత నెలలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో 10వేల మంది ప్రేక్షకులతో ఈ టోర్నీ అనుమతిస్తామని నిర్వహకులు అనుకున్నారు. కానీ కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో ప్రేక్షకుల్లేకుండానే ఒలింపిక్స్‌ను నిర్వహించాలని జపాన్‌ ప్రధాని యోషిహిదే సుగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

 



సంబంధిత వార్తలు

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి

PM Modi At Guyana Parliament: ఇది యుద్ధాల శ‌కం కాదు! గ‌యానా పార్ల‌మెంట్ లో ప్ర‌ధాని మోదీ కీల‌క వ్యాఖ్య‌ల‌, ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై త‌న‌దైన శైలిలో స్పంద‌న‌

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం..గయానా 'ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్ లెన్స్' పురస్కారం, డొమినికా అత్యున్నత పురస్కారంతో సత్కారం

G20 Summit 2024: మీ దేశంలో దాక్కున్న ఆ ఇద్దరు ఆర్థిక నేరగాళ్లను భారత్‌కు అప్పగించండి, జీ20 సమావేశంలో బ్రిటన్ ప్రధానిని కోరిన పీఎం నరేంద్ర మోదీ