Picture used for representational purpose (Photo Credits: Getty Images)

London, Jul 3: యూరో 2020 ఫుట్‌బాల్ టోర్నీ ర‌స‌వ‌త్త‌ర ద‌శ‌కు చేరుకున్న‌ది. బెల్జియంతో జ‌రిగిన హోరాహోరీ పోరులో (UEFA EURO 2020) నెగ్గిన ఇట‌లీ ఆ టోర్నీలో సెమీస్‌కు చేరుకున్న‌ది. మునిచ్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో ఇట‌లీ 2-1 గోల్స్ తేడాతో బెల్జియంపై విజ‌యం సాధించింది. రెండు జ‌ట్లు అద్భుతంగా ఆడిన తుది ఫ‌లితం మాత్రం ఇట‌లీని వ‌రించింది. ఈ టోర్నీలో ఇట‌లీ బెస్ట్ టీమ్‌గా రూపుదిద్దుకున్న‌ది. వ‌ర‌ల్డ్ ర్యాంకింగ్‌లో బెల్జియం టాప్‌లోనే ఉన్నా.. మునిచ్‌లో మాత్రం ఆ జ‌ట్టుకు నిరాశే మిగిలింది. ఇట‌లీ జ‌ట్టులో అజ్జూరీ రెండు గోల్స్ చేసి ఆ జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. సెమీస్‌లో స్పెయిన్‌తో ఇట‌లీ త‌ల‌ప‌డ‌నున్నది.

ఇక సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్‌లో జ‌రిగిన మ‌రో ఫుట్‌బాల్ మ్యాచ్‌లో స్పెయిన్ 3-1 తేడా గోల్స్‌తో స్విట్జ‌ర్లాండ్‌పై గెలుపొందింది. తొలుత రెండు జ‌ట్లు 1-1 గోల్స్ తో స‌మంగా నిలిచాయి. అయితే పెనాల్టీ షూటౌట్‌లో స్పెయిన్ త‌న స‌త్తా చాటింది. స్విజ్ జ‌ట్టు దాదాపు 45నిమిషాల పాటు కేవ‌లం ప‌ది మంది ఆట‌గాళ్ల‌తో మ్యాచ్ ఆడింది. కానీ పెనాల్టీ షూటౌట్‌లో స్పెయిన్ గోల్‌కీప‌ర్ సైమ‌న్ రెండు గోల్స్‌ను సేవ్ చేశాడు. ప్రధానంగా పెనాల్టీల సాయంతో స్విస్‌ను స్పెయిన్ మట్టి కరిపించింది. 3-1 మ్యాచ్ గెలిచి సత్తా చాటింది. టోర్నీలో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది.

మూడు సార్లు చాంపియన్‌ స్పెయిన్‌ ఫైనల్ బెర్త్ కోసం ఇటలీతో (Italy and Spain) తలపడనుంది. ఇదిలా ఉంటే ఈ రోజు చెక్‌ రిపబ్లిక్‌, డెన్మార్క్‌లు మరో మ్యాచ్ లో తలపడనున్నాయి.