Road Accident: జడ్చర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం వ్యానును ఢీకొట్టి అగ్నికి ఆహుతైన ఏపీఎస్ఆర్టీసీ బస్సు.. తృటిలో తప్పించుకొన్న ప్రయాణికులు
హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతైంది.
Hyderabad, July 15: మహబూబ్ నగర్ జిల్లా (Mahabubnagar District) జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి సమీపంలో ఆదివారం అర్థరాత్రి 1.45 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. హైదరాబాద్ (Hyderabad) నుంచి ఏపీ వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతైంది. బస్సు, డీసీఎం వ్యాను ఒకదానికొకటి ఢీకొనడంతో బస్సులో మంటలు అంటుకొన్నాయి. అయితే, ప్రమాదాన్ని పసిగట్టిన ప్రయాణికులందరూ బస్సులోనుంచి వేగంగా దూకడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ లగ్జరీ బస్సు నిన్న రాత్రి 12 గంటలకు హైదరాబాద్ లోని ఎంబీబీఎస్ నుంచి ప్రయాణికులతో బయలుదేరింది. బురెడ్డిపల్లి మలుపు వద్ద డీసీఎం వాహనం యూటర్న్ తీసుకునేందుకు ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఈ క్రమంలో బస్సు, డీసీఎం ఒకదానికొకటి ఢీకొన్నాయి.
దూకగానే..
డీసీఎం బలంగా ఢీకొట్టడంతో బస్సు అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు అద్దాలు పగలగొట్టుకొని బయటకు దూకారు. ఆ కాసేపటికే బస్సులో మంటలు అంటుకున్నాయి. గాయపడిన 15 మంది ప్రయాణికులను మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బీఎస్పీ చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసు నిందితుడు తిరువేంగడం ఎన్ కౌంటర్ లో హతం