2024 భారతదేశం ఎన్నికలు: ఏపీలో పెద్ద ఎత్తున నామినేష‌న్ల తిర‌స్క‌ర‌ణ‌, 175 స్థానాల్లో 2705 నామినేష‌న్ల‌కు ఆమోదం, తెలంగాణ‌లో 17 లోక్ సభ స్థానాల‌కు 625 నామినేష‌న్లకు ఈసీ ఓకే

మొత్తం 893 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 268 మంది అభ్యర్థులు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు గాను 625 మంది అభ్యర్థులు నామినేషన్లకు ఆమోదం పొందాయి.

Election Commission (File Photo)

Hyderabad, April 27: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు (AP Elections) గత నెల 18న నోటిఫికేషన్ విడుదల కాగా, ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరించారు. 26న నామినేషన్లు (Nominations) పరిశీలించారు. ఏపీలోని మొత్తం 25 పార్లమెంట్ నియోజక వర్గాలకు 503 నామినేషన్లు ఆమోదం పొందాయని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. అలాగే, 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు 2,705 నామినేషన్లు ఆమోదం పొందాయని చెప్పారు. ఓటు వేసి, ప్రతి ఒక్కరితో ఓటు వేయించాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటు హక్కు వినియోగించుకోవడం దేశ పౌరుడిగా మన భాధ్యత అని తెలిపారు.

YSRCP Manifesto: వైయ‌స్ఆర్‌సీపీ 2024 మేనిఫెస్టో విడుదల..రెండు విడతల్లో పెన్షన్‌ రూ.3,500 దాకా పెంపు..అమ్మ ఒడి రూ. 17వేలకు పెంపు ...మేనిఫెస్టోలోని ముఖ్య అంశాలు ఇవే 

మరోవైపు, తెలంగాణలో మొత్తం 1,488 సెట్ల నామినేషన్లకు గాను 428 తిరస్కరణకు గురయ్యాయి. పరిశీలన తరువాత 1,060 సెట్ల నామినేషన్లకు ఆమోదం తెలిపారు. మొత్తం 893 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 268 మంది అభ్యర్థులు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు గాను 625 మంది అభ్యర్థులు నామినేషన్లకు ఆమోదం పొందాయి. అత్యధికంగా మెదక్ బరిలో 53 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, అత్యల్పంగా ఆదిలాబాద్ లోక్ సభ స్థానంలో 8 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.