YSRCP Manifesto: వైయ‌స్ఆర్‌సీపీ 2024 మేనిఫెస్టో విడుదల..రెండు విడతల్లో పెన్షన్‌  రూ.3,500 దాకా పెంపు..అమ్మ ఒడి రూ. 17వేలకు పెంపు ...మేనిఫెస్టోలోని ముఖ్య అంశాలు ఇవే
Cm Jagan (Photo-Video Grab)

ఆంధ్రప్రదేశ్‌లో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ప్రజలకు తోడుగా ఉన్నామని, ఆఖరికి కోవిడ్‌ లాంటి కష్టకాలంలోనూ సాకులు చెప్పకుండా సంక్షేమం అమలు చేశామని సీఎం వైయ‌స్ జగన్‌ చెప్పారు. శనివారం ఉదయం తాడేపల్లిలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైయ‌స్ఆర్‌సీపీ మేనిఫెస్టో 2024ను విడుదల చేశారు.

మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. గతంలో ఎన్నికలప్పుడు రంగు రంగుల హామీలతో ముందుకు వచ్చేవారు. కానీ, మేం మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌గా భావించాం. గత ఐదేళ్లలోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చింది. ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో, అధికారి దగ్గర మేనిఫెస్టో ఉంది. రాష్ట్రంలో ప్రతీ ఇంటికి మేనిఫెస్టోను పంపించాం. ఓ ప్రొగ్రెస్‌ కార్డు మాదిరి ఏం ఏం చేశామన్నది ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ వచ్చాం. ఈ 58 నెలల్లో పథకాల్ని డోర్‌ డెలివరీ చేశాం. ఏ నెలలో ఏ పథకాల్ని ఇస్తామో చెప్పి మరీ అమలు చేశాం.

కానీ, 2019లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశాం. 2014లోనూ నాకు బాగా గుర్తుంది. ఆనాడు కూడా చేయగలిగిందే చెప్పాం. అమలు చేసినా, చేయకున్నా.. చంద్రబాబులా హామీలు ఇచ్చేదామని చాలామంది నా మంచి కోసమంటూ చెప్పారు. కానీ, నేను మాత్రం మోసపూరిత హామీల్లో చంద్రబాబుతో పోటీ పడలేకపోయా. చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు.. చేయగలిగింది మాత్రమే చెప్పా. 2019లో చేయగలిగిందే చెప్పా. చెప్పిందంతా చేసి చూపించి ప్రజలకు దగ్గరకు ఒక హీరోగా వెళ్తున్నా. ఇదీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా. ప్రజలు ఈ తేడా గమనించాలి. నాయకుడిని నమ్మి ప్రజలు ఓటేస్తారు. లీడర్‌షిప్‌ అంటే చెప్పిన ప్రతీ మాట అమలు చేస్తూ ముందుకు వెళ్లడమే.

మేనిఫెస్టోలోని కొన్ని ముఖ్యమైన అంశాలు :

>> ఈ ఏడాది కూడా మేనిఫెస్టో కేవలం రెండు పేజీలు ఉంది.

>> వైద్యం..విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ, ఆరోగ్య ఆసరా, విలేజ్‌ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, 17 కొత్త మెడికల్‌ కాలేజీలు, జగనన్న ఆరోగ్యసురక్ష

వ్యవసాయం:

>> రైతు భరోసా, ఆర్‌బీకేలు, ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పంట రుణాలు, పగటి పూటే 9 గంటల ఉచిత కరెంటు, సమయానికే ఇన్‌ఫుట్‌ సబ్సిడీ

ఉన్నత విద్య:

>> జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జాబ్‌ ఓరియెంటేడ్‌గా కరిక్యూలమ్‌లో మార్పులు.

నాడు–నేడు:

>> ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రుల్లో నాడు–నేడు

>> అక్కచెల్లెమ్మల పేరిట పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు

మహిళా సాధికారత:

>> వైయస్‌ఆర్‌ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ

సామాజిక భద్రత:

>> వైయస్‌ఆర్‌ పెన్షన్‌కానుక రెండు విడతల్లో రూ.3500పెంపు, ఇంటి వద్దే వలంటీర్ల ద్వారా ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ

>> అభివృద్ధి, మౌనిక వసతులు, సుపరిపాలన, నిర్మిస్తున్న నాలుగు పోర్టులు పూర్తి చేయడం, ఫిషింగ్‌ హార్బర్లు, ఎయిర్‌పోర్టు నిర్మాణాలు పూర్తి, ఇండస్ట్రీయల్‌ కారిడార్లు, నోడ్స్‌ పూర్తి, ప్రాధాన్యత క్రమంలో జలయజ్ఞం పూర్తి, గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ.

మహిళలు:

>> వైయస్‌ఆర్‌ చేయూత కార్యక్రమం ఇప్పటి వరకు రూ.75 వేలు ఇచ్చాం. దాన్ని కొనసాగిస్తూ నాలుగు దఫాల్లో రూ.1.50 లక్షలకు పెంచుతాం.

>> వైయస్‌ఆర్‌ కాపు నేస్తం రూ.1.20 లక్షల వరకు పెంపు

>> వైయస్‌ఆర్‌ ఈబీసీ నేస్తం రూ.1.05 లక్షలకు పెంపు

>> జగనన్న అమ్మ ఒడి గతంలో రూ.15 వేలు ఇచ్చేవాళ్లం. 17 వేలకు పెంపు..తల్లి చేతికే రూ.15 వేలు వెళ్తుంది. మరో రూ.2 వేలు స్కూల్‌ మెయింటెన్స్‌ కోసం కేటాయిస్తాం.

>> వైయస్‌ఆర్‌ ఆసరా కింద రూ.25,571 కోట్లు నాలుగు దఫాల్లో ఇచ్చాం. రూ.3 లక్షల దాకా రుణాలపై సున్నా వడ్డీ చెల్లింపు.ఇది మరో ఐదేళ్లు కొనసాగుతుంది.

>> వైయస్‌ఆర్‌ కళ్యాణమస్తు,షాదీ తోఫా ఈ ఐదేళ్లు కూడా కొనసాగుతుంది. పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.

>> పేదలందరికీ ఇళ్ల పట్టాలు, ఇప్పటికే 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇప్పటికే 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి అవుతున్నాయి. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతోంది. మిగిలిన ఇళ్లు కూడా నిర్మిస్తాం.

>> పట్టణ గృహ నిర్మాణాలు పెద్ద ఎత్తున చేపడుతాం. ప్రతి ఏటా రూ.1000 కోట్లు కేటాయిస్తూ ఎంఐజీ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలు చేస్తాం. మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తక్కువ రేట్లకు పట్టాలు ఇస్తాం.

పింఛన్ల పెంపు:

>> మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నాలుగు సంవత్సరాల పది నెలల..ఎన్నికలకు రెండు నెలలకు ముందు రూ.1000 పింఛన్‌ఇచ్చేవారు. ఎన్నికలకు ఆరు నెలల వరకు 39 లక్షల మందికి పింఛన్లు ఇచ్చేవారు. 66 లక్షల మందికి మనం పింఛన్లు ఇస్తున్నాం. రూ.3 వేలు ఇస్తున్నాం. ఏడాదికి రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. దేశంలోనే రూ.3 వేలు ఇస్తున్న రాష్ట్రం, 66 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నది మన రాష్ట్రంలోనే, మన ప్రభుత్వంలోనే. జగన్‌కు మనసు, మానవత్వం ఉంది. అవ్వాతాతలపై నేను చూపించినంత ప్రేమ ఎవరు చూపించలేరు. పింఛన్లు రూ.3500 పెంపు. 2028 జనవరిలో రూ.250, 2029 జనవరిలో రూ.250 పెంచుతాను. అబద్ధాలు చెప్పలేను. రాష్ట్ర ఆదాయం లేకపోతే ఇంత సొమ్ము ఖర్చు చేయలేము. ఇప్పుడు చేస్తున్న పథకాలతో రాష్ట్ర బడ్జెట్‌ కుదుటపడితే మళ్లీ కొద్దో గొప్పో వెసులుబాటు కలిగితే చివరి రెండేళ్లలో పెంచుతానని చెబుతున్నాను.

వ్యవసాయ రంగం:

>> రైతులకు ఇచ్చే రైతు భరోసా సొమ్ము ఇప్పటికే రూ.65,500 ఇవ్వగలిగాం. ఈసారి రూ.16 వేలకు పెంచి ఐదేళ్లలో రూ.80 వేలు ఇవ్వబోతున్నాం. ఐదేళ్లలో 55 లక్షల మంది రైతుల సంక్షేమం కోసం ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి ఏటా మూడు దఫాలుగా రైతు భరోసా ఇస్తాం. పంట వేసే సమయంలో రూ.8 వేలు, కోత సమయంలో రూ.4 వేలు, సంక్రాంతి మరో రూ.4 వేలు ఇస్తాం

>> రైతులకు ఉచిత పంటల బీమా కొనసాగుతుంది. పంట రుణాలకు సున్నావడ్డీ, కౌలు, అటవీ, దేవాదాయ భూముల రైతులకు రైతు భరోసా ఇస్తాం. మేనిఫెస్టోలోని ఇవన్నీ కొనసాగుతాయి.

>> మన మేనిఫెస్టో మాయం చేయం. ఎప్పుడు కూడా నెట్‌లో అందుబాటులో ఉంటుంది.

> స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ మత్స్యకారభరోసా కొనసాగుతుంది. రూ.1 లక్షదాకా పెంపు

>> వాహనమిత్ర ద్వారా రూ.1 లక్ష వరకు పెంపు. సొంత టిప్పర్, లారీలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తాం, ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే బీమా చెల్లిస్తాం. బ్యాంకు రుణాలపై అర్ధరూపాయి వడ్డీ భారంమాత్రమే వారిపై ఉండేలా ప్రభుత్వం చెల్లిస్తుంది.

>> లా నేస్తం కొనసాగుతుంది.

>> చేనేత కార్మికులకు 1.25 లక్షల మందికి మంచి చేస్తూ ఐదేళ్లలో 1.20 లక్షల ఇచ్చాం. దీన్ని మరో రూ.1.20 లక్షలకు పెంచుతూ రూ.2.40 లక్షలు ఇస్తాం.

యువత, ఉపాధి:

>> రాష్ట్రంలో స్కిల్‌ హబ్‌లు నెలకొల్పుతున్నాం.

>> 500 మంది గిరిజన తాండ ఉన్న గ్రామాలను పంచాయతీలుగా మార్చాం. 450 సచివాలయాలు ఏర్పాటు చేశాం.

>> జనాభాలో 50 శాతం దళితులు ఉంటే ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం. >> దళితులు 500 ఆవాసాలుగా ఉంటే దళిత పంచాయతీగా మార్చుతాం.

>> క్రిస్టియన్, మైనారిటీలకు ఇప్పటికే ఉన్న పథకాలు కొనసాగుతాయి.

>> హిందు దేవాలయాలకు ఇప్పుడు జరుగుతున్న అన్నీ కూడా కొనసాగుతాయి. >> దేవాలయాల నిర్వాహణలకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నాం.

>> బీసీ సంక్షేమం కొనసాగుతుంది. ముస్లిం మైనారిటీల సంక్షేమం కొనసాగుతుంది. కాపు సంక్షేమం కొనసాగుతుంది. ఓసీ సంక్షేమం కొనసాగుతుంది. కులవృత్తిదారులు, చిరువ్యాపారులకు జగనన్న తోడు కార్యక్రమం ద్వారా దాదాపుగా 16 లక్షల మందికి రూ.10 వేల వరకు సున్నా వడ్డీకేరుణాలు ఇచ్చాం. 15 వేలకు పెంచి రూ.20 వేల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. జగనన్న చేదోడు కొనసాగుతోంది.

ప్రభుత్వ ఉద్యోగులు:

>> వచ్చే ఐదేళ్లలో జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఈ ఏడాది నుంచి వారు విదేశీ విద్యకు తీసుకున్న బ్యాంకురుణంలో రూ. 10 లక్షల వరకు ప్రభుత్వమే వడ్డీ భరిస్తుంది.

>> ఆప్కాస్‌ ఉద్యోగులు రూ.25 వేలకు వేతనం పొందేవారు, అంగన్‌వాడీలకు విద్యా, వైద్యం, ఇళ్లకు సంబంధించి అన్ని నవరత్నాలు వర్తిస్తాయి.

>> స్వీగ్వీ, జోమాటో డెలివరీ బాయ్స్‌కు వైయస్‌ఆర్‌ జీవన బీమా రూ.5 లక్షలు వర్తింపు.

>> సురక్షిత తాగునీటిపై ప్రత్యకశ్రద్ధ పెడతాం.

>> రోడ్ల మరమ్మతులు, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

>> జిల్లా కేంద్రాలను అభివృద్ధి చేసే దిశగా అడుగులు

>> ప్రతి జిల్లాలోనూ పీపీ పద్ధతిలో పరిశ్రమలు

>> ఎంఎస్‌ఎంఈలో ప్రతి ఏటా ప్రోత్సాహకాలు

>> 2024లో అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖ పరిపాలన రాజధానిగా పాలన సాగుతుంది.

>> అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తాం