AP Covid Update: గుంటూరులో కరోనా కల్లోలం, ఒక్కరోజే 48 కేసులు, ఏపీలో తాజాగా 298 మందికి కరోనా, ఇద్దరు మృతితో 7,184కి చేరిన కోవిడ్ మరణాల సంఖ్య

అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 90 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 48 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. తూర్పు గోదావరి జిల్లాలో 32, కృష్ణా జిల్లాలో 32, విశాఖ జిల్లాలో 32 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Coronavirus outbreak | (Photo Credits: IANS)

Amaravati, Mar 15: ఏపీలో గడచిన 24 గంటల్లో ఏపీలో 45,664 కరోనా పరీక్షలు నిర్వహించగా 298 మందికి పాజిటివ్ అని నిర్ధారణ (AP Coronavirus) అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 90 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 48 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. తూర్పు గోదావరి జిల్లాలో 32, కృష్ణా జిల్లాలో 32, విశాఖ జిల్లాలో 32 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 164 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు (Covid Deaths) మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 8,91,861 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,83,277 మంది కరోనా ప్రభావం నుంచి విముక్తులయ్యారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 1000కి పైనే నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,400 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మరణాల సంఖ్య 7,184కి పెరిగింది.

ఇదిలా ఉంటే గుంటూరు జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. జిల్లాలో గత కొద్ది నెలల నుంచి 10 లోపు కేసులే నమోదవుతుండగా, ఆదివారం ఒకే రోజు 48 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. పొన్నూరు పట్టణంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో 8 మంది విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చినట్టు తహసీల్దార్‌ డి.పద్మనాభుడు చెప్పారు. వారితో పాటు పట్టణంలోని మరో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చినట్టు తెలిపారు.

ఔటర్‌ రింగు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం, శామీర్‌పేట ఓఆర్‌ఆర్‌ దగ్గర విషాద ఘటన

పాఠశాలను మూసివేసి పిల్లలను హోం క్వారెంటైన్‌లోఉంచినట్టు తెలిపారు. అలాగే తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో ఆరుగురు ఉద్యోగులు కోవిడ్‌ బారిన పడినట్టు సిబ్బంది చెప్పారు. కార్యాలయ మేనేజర్, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, కంప్యూటర్‌ ఆపరేటర్లకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిసింది. ఈ నెల 10న మున్సిపల్‌ ఎన్నికల విధుల్లో వీరు పనిచేయడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.