Prakasam Shocker: కన్నతండ్రి కాదు కామాంధుడు..తాగిన మత్తులో 7 నెలల నుంచి 14 ఏళ్ల కూతురిపై అత్యాచారం, బాలిక గర్భం దాల్చడంతో అమానుష ఘటన వెలుగులోకి, అవ్వ, తాతలతో కలిసి బేస్తవారిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధిత బాలిక
మద్యం మత్తులో ఏడు నెలలుగా తన శారీరక వాంఛ (Drunk man rapes, impregnates daughter) తీర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఆ బాలిక (14 ) ఐదు నెలల గర్భిణి దాల్చింది.
Bestavaripeta, July 17: కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కన్నకూతురి పాలిట కామాంధుడయ్యాడు. మద్యం మత్తులో ఏడు నెలలుగా తన శారీరక వాంఛ (Drunk man rapes, impregnates daughter) తీర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఆ బాలిక (14 ) ఐదు నెలల గర్భిణి దాల్చింది. ఈ అమానుష సంఘటన బేస్తవారిపేట మండలంలోని (Bestavaripeta mandal in Prakasam district) బాలేశ్వరపురంలో గురువారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు అవ్వ, తాతతో కలిసి బాలిక బేస్తవారిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
బేస్తవారిపేట ఎస్సై మాధవరావు కథనం మేరకు..ప్రకాశం జిల్లా బేస్తవారిపేట (Bestavaripeta) మండలంలోని బాలేశ్వరపురానికి చెందిన ఓ వ్యక్తి (49)కి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో ఇద్దరికి వివాహమైంది. 14 ఏళ్ల కుమార్తెతో కలిసి తండ్రి తల్లి ఇద్దరు గ్రామానికి సమీపంలోని శింగరపల్లెలో మామిడి తోటలో కాపలాగా ఉంటున్నాడు.
జనవరి నెలలో మామిడి తోట నుంచి గ్రామంలోకి సరుకుల కోసం భార్య వెళ్లిన సమయంలో మద్యం మత్తులో తండ్రి ఒంటరిగా ఉన్నకుమార్తెపై లైంగికదాడి చేశాడు.ఆ తరువాత ఈ విషయాన్ని ఇంటికి వచ్చిన తల్లికి కూతురు చెప్పినా ఆమె పట్టించుకోలేదు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని అతను బెదిరించడంతో భయపడిన భార్య, కుమార్తెలు నోరుమెదపకుండా ఉండిపోయారు. అప్పటి నుంచి కూతురిని ఆ కామాంధుడు శారీరకంగా అనుభవిస్తున్నాడు.
ఈక్రమంలోనే బాలిక గర్భం దాల్చింది. బాలిక కడుపు నొప్పితో బాధపడుతుండటంతో గలిజేరుగుళ్ల వైద్యశాలలో చూపించారు. బాలిక ఐదు నెలల గర్భిణిగా ఉందని కుటుంబ సభ్యులకు వైద్యులు చెప్పడంతో ఈ దారుణంవెలుగులోకి వచ్చింది. బాలిక అవ్వ, తాతలతో కలిసి బేస్తవారిపేట పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తండ్రి చేసిన అఘాయిత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు పెట్టేందుకు కూతురు వెళ్లిందనే సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇద్దరు సెల్‌ఫోన్‌లు స్విచ్‌ఆఫ్ చేసి పరారయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.