AP Coronavirus Updates: పెళ్లికొడుకుకి కరోనా, 500 మందిలో మొదలైన టెన్సన్, ఏపీలో తాజాగా 8,012 కేసులు, గత 24 గంటల్లో 10,117 మంది డిశ్చార్జ్, 2,89,829కి చేరుకున్న మొత్తం కేసులు సంఖ్య
గడిచిన 24 గంటల్లో 48,746 మందికి పరీక్షలు చేయగా 8,012 మందికి పాజిటివ్‌గా (Andhra Pradesh Coronavirus) తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు (AP Coronavirus) 2,89,829కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ ఆదివారం బులెటిన్‌లో పేర్కొంది.రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 28,60,943 పరీక్షలు నిర్వహించారు. తాజాగా 88 మంది మృతితో (Coronavirus Deaths) మొత్తం మరణాలు 2,650కి చేరాయి. యాక్టివ్ కేసులు 85,945 ఉన్నాయి.
Amaravati, August 17: రాష్ట్రంలో కరోనా నుంచి ఆదివారం ఒక్కరోజు 10,117 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవడంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 2,01,234కి చేరింది. గడిచిన 24 గంటల్లో 48,746 మందికి పరీక్షలు చేయగా 8,012 మందికి పాజిటివ్‌గా (Andhra Pradesh Coronavirus) తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు (AP Coronavirus) 2,89,829కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ ఆదివారం బులెటిన్‌లో పేర్కొంది.రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 28,60,943 పరీక్షలు నిర్వహించారు. తాజాగా 88 మంది మృతితో (Coronavirus Deaths) మొత్తం మరణాలు 2,650కి చేరాయి. యాక్టివ్ కేసులు 85,945 ఉన్నాయి.
విశాఖపట్నం జిల్లా కోటవురట్ల మండలం కొడవటిపూడి గ్రామంలొ ఓ పెళ్లి కరోనా కలకలాన్ని రేపింది. ఈ గ్రామానికి చెందిన పెళ్లి కుమారుడికి ఆదివారం కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో బంధు వర్గాల్లో కలవరం మొదలైంది. గ్రామానికి చెందిన 31 ఏళ్ల యువకుడు రంగారెడ్డి జిల్లా నుంచి 20 రోజుల కిందట వచ్చాడు. ఇతనికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఈ నెల 5న వీఎల్‌ఎం కిట్‌తో కోవిడ్ పరీక్ష చేసి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి నమూనా పంపించారు. జగన్ సర్కారు మరో సంచలన నిర్ణయం, ప్రతి పరిశ్రమకూ ఆధార్ తరహాలో ప్రత్యేక సంఖ్య, సమగ్ర సర్వే కోసం కమిటీల ఏర్పాటు, అక్టోబర్ 15 లోపు సర్వేను పూర్తిచేయాలని ఉత్తర్వులు
అయితే ఫలితం రాకముందే యువకుడు ఈ నెల 15న రావికమతం గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. ఆదివారం కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో పెళ్లికి వచ్చిన వారిలో ఇప్పుడు కరోనా టెన్సన్ మొదలైంది. . అదే గ్రామంలో చర్చిలో జరిగిన వివాహానికి పాస్టరుతో పాటు ఇరువైపులా బంధువులు సుమారు 90 మంది పాల్గొన్నారు. అదే రోజు మధ్యాహ్నం ఇంటి దగ్గర పెట్టిన భోజనాల కార్యక్రమంలో సుమారు 500 మందికి పైగా పాల్గొన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు.
దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. భారత్‌లో 24 గంటల్లో 57,982 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 941 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 26,47,664కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 50,921 కి పెరిగింది. ఇక 6,76,900 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 19,19,843 మంది కోలుకున్నారు.