Anakapalle Pharma Company Explosion: అచ్యుతాపురం సెజ్ ప్రమాదం, మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు, 17 మంది మృతి
విశాఖపట్నం చేరుకున్న ఆయన.. నేరుగా మెడికవర్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Vjy, August 23: అనకాపల్లి అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. విశాఖపట్నం చేరుకున్న ఆయన.. నేరుగా మెడికవర్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులతోనూ మాట్లాడి త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భయపడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం బాధితుల కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత ఆస్పత్రి వెలుపల సీఎం మీడియాతో మాట్లాడారు. పేలుడు ధాటికి ఛిద్రమైన కార్మికుల మృతదేహాలు, అచ్యుతాపురం సెజ్‌అగ్నిప్రమాదంలో 16కు పెరిగిన మృతుల సంఖ్య, మరో 50 మందికి గాయాలు
ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలచివేసింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా.. 36 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 10 మంది తీవ్రంగా, 26 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఎంత ఖర్చు అయినా బాధితులందరికీ ఉత్తమ వైద్య సేవలందిస్తాం. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తాం. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందజేస్తాం. ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
తీవ్ర గాయాలపాలైన వారికి రూ.50లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25లక్షల చొప్పున పరిహారం ఇస్తాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయి. దాని పర్యవసానమే ఈ ప్రమాదం’’ అని సీఎం అన్నారు.
Here's TDP Tweets
అచ్యుతాపురం ఫార్మా ప్రమాదం చాలా బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదంలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. కాలుష్య నియంత్రణ తన శాఖ పరిధిలో ఉందని, భద్రత వేరే శాఖ కిందికి వస్తుందని చెప్పారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని గతంలో చాలా సార్లు చెప్పామన్నారు. ప్రజల ప్రాణాలు, కార్మికుల భద్రత కోసం సేఫ్టీ ఆడిట్ చేయించాలని అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్‌లో విశాఖ జిల్లాకు వెళ్లి భద్రతా చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు.
అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదం దిగ్భ్రాంతి కలిగించిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 17 మంది మృతిచెందడం బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేశామన్నారు. కంపెనీ నుంచి బాధితులకు పరిహారం ఇప్పిస్తామని వివరించారు. ప్రభుత్వం తరఫున కూడా సహకారం అందిస్తామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. చివరి బాధితుడి వరకు న్యాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. సీఎం చంద్రబాబు నేడు బాధితులను పరామర్శిస్తారని కొల్లు రవీంద్ర తెలిపారు.