Anakapalle, August 21: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి విదితమే. రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 16కి చేరింది. మరో 50మందికి పైగా గాయపడ్డారు. పేలుడు ధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. పేలుడు ధాటికి ఛిద్రమైన కార్మికుల మృతదేహాలు, అచ్యుతాపురం సెజ్‌అగ్నిప్రమాదంలో 16కు పెరిగిన మృతుల సంఖ్య, మరో 50 మందికి గాయాలు
రాంబిల్లి మండలం అచ్చుతాపురం సెజ్‌లోని ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రి వాసంశెట్టి సుభాశ్(Vasamsetti subhash) తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఫార్మాకంపెనీలో జరిగిన ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ప్రమాదంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి గురువారం అచ్యుతాపురంలో పర్యటించనున్నారు. ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను, ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు. విషాదకర వీడియోలు ఇవిగో, మంటల్లో మాడిమసైన కార్మికుల మృతదేహాలు, అచ్యుతాపురం సెజ్‌అగ్నిప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య
ప్రమాద ఘటనపై హెల్త్ సెక్రటరీ, సెక్రటరీ ఇండస్ట్రీస్, డైరెక్టర్ ఫ్యాక్టరీస్, కమిషనర్ లేబర్, డైరెక్టర్ బాయిలర్స్, ఎస్డీఆర్ఎఫ్ సహా జిల్లా ఉన్నతాధికారుతో ఎప్పటికప్పుడు సీఎం మాట్లాడి వారికి సూచనలు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన 41 మందికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అవసరమైతే క్షతగాత్రులను విశాఖ లేదా హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించాలని సూచించారు. కార్మికుల ప్రాణాలు కాపాడడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించాలని అధికారులకు స్పష్టం చేశారు.