Gold Coins Found In Eluru: పైపులైను కోసం తవ్వుతుండగా బయటపడిన మట్టిపడిత.. తెరిచి చూస్తే మిలమిల మెరుస్తూ కనిపించిన పురాతన బంగారు నాణేలు.. వాటిని చూసి ఆ ఇల్లాలు ఏం చేసింది? ఏలూరు జిల్లాలోని ఏడువాడల పాలెంలో ఘటన

ఇంతలో ఆమెకు ఓ చిన్న మట్టిలో పడిత కనిపించింది. ఏమిటా అని దాన్ని తెరిచి చూసింది. అంతే షాక్.. మిలమిల మెరుస్తూ 18 బంగారు నాణేలు అందులో కనిపించాయి.

Credits: Whatsapp

Eluru, Dec 3: తనకున్న ఆయిల్ పాం (Oil Palm) తోటలో పైపు లైను (Pipe Line) కోసం తవ్వుతున్నారు ఏలూరు (Eluru) జిల్లాలోని కొయ్యలగూడెం మండలం ఏడువాడల గ్రామానికి చెందిన మానుకొండ తేజస్వి. ఇంతలో ఆమెకు ఓ చిన్న మట్టిలో పడిత కనిపించింది. ఏమిటా అని దాన్ని తెరిచి చూసింది. అంతే షాక్.. మిలమిల మెరుస్తూ 18 బంగారు నాణేలు (Gold Coins) అందులో కనిపించాయి.

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రద్దీ మార్గాల్లో ప్రత్యేక రైళ్ల ఏర్పాటు.. ఏఏ రూట్లలో ఏ సర్వీసు అంటే??

దీంతో ఆమె వెంటనే భర్త సత్యనారాయణకు చెప్పింది. ఇద్దరూ కలిసి తహసీల్దారుకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దారు మట్టిపిడతను పరిశీలించారు. అందులోని ఒక్కో నాణెం 8 గ్రాములకు పైనే ఉన్నట్టు నిర్ధారించారు. ఈ నాణేలను రెండు శతాబ్దాల నాటిగా భావిస్తున్నారు. కాగా, గత నెల 29న ఇవి లభ్యం కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.



సంబంధిత వార్తలు