AP Capital: అమరావతా లేక మూడు రాజధానులా..?,కీలక ఘట్టానికి వేదిక కానున్న ఏపీ అసెంబ్లీ, 13 జిల్లాలు అభివృద్ధి చెందాల్సిందేనన్న మెజార్టీ ప్రజలు, అమరావతే కావాలంటున్న 3 గ్రామాల ప్రజలు, మూడు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు
రాష్ట్రంలోని 13 జిల్లాలు (13 districts) అభివృద్ధి చెందాల్సిందేనని, ఆ దిశగా ప్రభుత్వం (AP GOVT)నిర్ణయం తీసుకోవాలని కొద్ది రోజులుగా అన్ని ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించడం.. మరో వైపు మూడు గ్రామాల ప్రజలు మాత్రం అన్నీ అమరావతి(Amaravathi) కేంద్రంగానే ఉండాలని పట్టుపట్టడం తెలిసిందే.
Amaravathi, January 20: రాష్ట్రంలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణలో కీలక ఘట్టానికి సోమవారం అసెంబ్లీ వేదిక కానుంది. రాష్ట్రంలోని 13 జిల్లాలు (13 districts) అభివృద్ధి చెందాల్సిందేనని, ఆ దిశగా ప్రభుత్వం (AP GOVT)నిర్ణయం తీసుకోవాలని కొద్ది రోజులుగా అన్ని ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించడం.. మరో వైపు మూడు గ్రామాల ప్రజలు మాత్రం అన్నీ అమరావతి(Amaravathi) కేంద్రంగానే ఉండాలని పట్టుపట్టడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర, సమ్మిళిత అభివృద్ధికి బాటలు వేసేందుకు వీలుగా పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మకమైన బిల్లును ప్రతిపాదించనుందని తెలుస్తోంది. నేటి నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు(Andhra Assembly Special Session) మొదలవ్వనున్నాయి.
నిఘా నీడలో అమరావతి
ముందుగా సీఎం(CM YS Jagan) అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. ఇటీవల జీఎన్ రావు కమిటీ (GN Rao committee), బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్(Boston Committee) నివేదికలపై అధ్యయనం చేసి, హైపవర్ కమిటీ (High Power Committee)రూపొందించిన నివేదిక గురించి ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది.
ఏపీలో హైటెన్సన్, సీఎం జగన్ ఇంటి దగ్గర భారీ బందోబస్తు
Here's ANI Tweet
అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న బిల్లులు, చర్చకు వచ్చే అంశాలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.పరిపాలనా రాజధానిగా విశాఖపట్టణం, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రతిపాదించే అంశంపై కూడా ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
YSRCP MLA RK on Ap capital
రాష్ట్ర విభజన తర్వాత శివరామకృష్ణన్ కమిటీ, ఇటీవల జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్.. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ నివేదికలు ఇచ్చాయి. ఈ కమిటీల నివేదికలపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ పలుమార్లు సమావేశమై విస్తృతంగా చర్చించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనూ సమావేశమై.. తమ పరిశీలనలో వెల్లడైన అంశాలను వివరించిన విషయం తెలిసిందే.
భారీ బందోబస్తు మధ్య ఏపీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు
Minister for Tourism and Culture Avanthi Srinivasa Rao
రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా అమరావతిలో చలో అసెంబ్లీకి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన ఆందోళనకారులను అరెస్టు చేశారు పోలీసులు. వారు ఇళ్లనుంచి బయటికి రాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తెల్లవారుజామునుంచే టీడీపీ నాయకులను, జెఎసి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. 48 నియోజకవర్గాలకు చెందిన టీడీపీ కీలక నేతలు, కార్యకర్తలను ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు.
టీడీపీ నేతల హౌస్ అరెస్ట్, ఖండించిన చంద్రబాబు
అరెస్టులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. టిడిపి మరియు జెఎసి నాయకులను నిర్బంధించడం పిరికి చర్య అని విమర్శించారు. అరెస్టయిన నాయకులను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అమరావతిలో జరిగిన నిరసనలపై పోలీసుల తీరును తప్పుబట్టిన హైకోర్టు
Here"S ANI Tweet
ఇటు అమరావతి ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. రాజధాని గ్రామాల్లో భారీగా పోలీసుల్ని మోహరించారు.. దాదాపు 5వేలమంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. సెక్రటేరియట్, అసెంబ్లీ దగ్గర సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు.
దమ్ముంటే 21మందితో రాజీనామా చేసి రెఫరెండంకి రా
ముఖ్యమంత్రి జగన్ కాన్వాయ్ వెళ్లే దారిలో కూడా పోలీసుల్ని భారీగా మోహరించారు. ఇటు ప్రకాశం బ్యారేజీపైన కూడా ఆంక్షలు విధించారు.. ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎవర్నీ అనుమతించేది లేదని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు.