Nimmagadda Ramesh Kumar: జగన్ సర్కారుకు మళ్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను (Nimmagadda Ramesh Kumar) కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఆయనను తొలగిస్తూ జగన్ సర్కార్ (Jagan Govt) ఇచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు (AP High Court) కొట్టేసింది. ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. నిమ్మగడ్డ తొలగింపు కోసం తెచ్చిన ఆర్డినెన్స్ ను కొట్టివేసింది.
Amaravati, May 29: ఏపీ ప్రభుత్వానికి (AP Govt) హైకోర్టులో మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను (Nimmagadda Ramesh Kumar) కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఆయనను తొలగిస్తూ జగన్ సర్కార్ (Jagan Govt) ఇచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు (AP High Court) కొట్టేసింది. ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. నిమ్మగడ్డ తొలగింపు కోసం తెచ్చిన ఆర్డినెన్స్ ను కొట్టివేసింది. మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ వివాదం, ఏపీ డీజీపీకి విజయసాయి రెడ్డి లేఖ, ఫోర్జరీ సంతకాలపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి, లేఖ తానే రాశానంటూ రమేష్ కుమార్ వివరణ
కాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ పదవీకాలాన్ని కుదిస్తూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చింది. అంతేకాదు నూతన ఎన్నికల కమిషనర్ గా కనగరాజ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ప్రభుత్వ పరిధిలో తమకున్నఅధికారాలతో చేశామని తెలిపింది. అయితే దీనిపై రమేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఇప్పటికే పలు దఫాలు వాదనలు విన్నది. నూతన ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ జడ్జి జస్టిస్ కనగరాజ్
పిటిషనర్ తరఫున న్యాయవాదులు ఆదినారాయణ, వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. నిమ్మగడ్డ రమేశ్ తొలగింపు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ఈ మేరకు కోర్టు ముందు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇటు ప్రభుత్వం కూడా నిమ్మగడ్డ వ్యవహార శైలి సరిగా లేదని.. తమకున్న అధికారాలతోనే ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని కుదించామని కోర్టులో వాదించింది. సుదీర్ఘంగా ఇరు పక్షాల వాదనలను విన్న హైకోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డనే కోనసాగించాలని స్పష్టం చేసింది.