AP Rain Update: 30న బంగాళాఖాతంలో అల్పపీడనం, కోస్తాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం, మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించిన అధికారులు

దీని ఫలితంగా కోస్తాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం (Andhra pardesh rains) ఉందని పేర్కొన్నారు.

Cyclone Bulbul intensifies into very severe cyclonic storm; to hit Odisha, Bengal with heavy rains (Photo Credits: PTI)

Amaravati, April 27: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏప్రిల్ 30 నుంచి మే మొదటివారంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు (Kannababu) వెల్లడించారు.. దీని ఫలితంగా కోస్తాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం (Andhra pardesh rains) ఉందని పేర్కొన్నారు.

తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. రాగల 48 గంటలు రాయలసీమలో 41-43 డిగ్రీలు అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు రైతులు, కూలీలు, పశు, గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని.. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కన్నబాబు సూచించారు.

ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం క్రమేణా బలపడుతోంది. దీని ప్రభావంతో దక్షిణ అండమాన్‌ తీర ప్రాంతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 30 నాటికి అల్పపీడనం ఏర్పడనుందని, వచ్చే 48 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఆదివారం ప్రకటించింది. వైసీపీ ఎంపీ ఫ్యామిలీకి కరోనా పాజిటివ్, రాజ్‌భవన్‌ని వదలని కోవిడ్ 19, పేకాట ఆడిన వ్యక్తి నుంచి 25 మందికి కరోనావైరస్, శ్రీకాకుళం జిల్లాలో కరోనావైరస్ ల్యాబ్

ఇది ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ వచ్చే 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారి, ఉత్తర ఈశాన్య దిశగా అండమాన్‌ నికోబార్‌ దీవుల వెంబడి మే 3 వరకూ పయనిస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో గంటకు 40 నుంచి 60 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని, రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే సూచనలున్నాయని (Heavy Rains In Andhra Pradesh) అధికారులు తెలిపారు.

ఉపరితల ద్రోణి ప్రభావంతో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు చోట్ల తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసాయి. రాబోయే నాలుగైదు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.  ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,097కు చేరుకుంది.

వ్యవసాయ పనులు చేసే వారు, గొర్రెలు, మేకల కాపరులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, ఉరుములతో వర్షం కురిసే సమ యంలో చెట్ల కిందకు వెళ్లొద్దని రాష్ట్ర విపత్తు నిర్వహణ స్పెషల్‌ కమిషనర్‌ కన్నబాబు హెచ్చరించారు. పిడుగులు పడే ప్రాంతాల సమాచారాన్ని రెండుమూడు గంటల ముందే గుర్తించి ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తామని, ప్రజలు అధికారుల సూచనలను పాటించాలని పేర్కొన్నారు.

మరోవైపు, విదర్భ నుంచి తమిళనాడు వరకూ కర్ణాటక మీదుగా 0.9 కిమీ ఎత్తులో ఉపరితల ద్రోణి కొన సాగుతుండడంతో నేడు, రేపు కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు, ఒక ట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

రాయలసీమలో నేడు, రేపు ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. రాయలసీమలో నేడు, రేపు గరిష్టంగా పలు చోట్ల 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయని పేర్కొన్నారు.

ఏపీలో ఆదివారం కుండ‌పోత వ‌ర్షంప‌డింది. ప‌లు చోట్ల పిడుగులు ప‌డ్డాయి. తూర్పు గోదావరి జిల్లాలో మూడేళ్ల చిన్నారి పిడుగు పడి మృతి చెందింది. తమిళనాడులో ఆదివారం భారీ వర్షం కురిసింది. తెల్ల‌వారుజామున మొద‌లైన వ‌ర్షం ఏక‌ధాటికి సుమారు ఐదారు గంటల పాటు కురిసింది.

రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని నష్ట పోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. వరి పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేసి రైతులకు పరిహారం ఇవ్వాల్సిందిగా సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారని వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు.

కొన్ని చోట్ల వరి తడిసినట్టు తమ దృష్టికి వచ్చిందని, దాని గురించి రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని, ముఖ్యమంత్రితో మాట్లాడి, తడిసిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు భరోసా ఇచ్చారు. దీంతో వరి పంట నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో వరి, మొక్కజొన్న, నువ్వులు, వేరుశనగ, 4579 హెక్టార్లలో, అరటి, బొప్పాయి వంటి ఉద్యాన పంటలకు 490 హెక్టార్లలో మొత్తం 5069 హెక్టార్లలో నష్టం వాటిల్లింది.