AP COVID-19 Report: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 81 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1,097 కు చేరిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తలు పాటించాలని మంత్రి ఆళ్ల నాని భరోసా
Coronavirus in AP (Photo Credits: IANS)

Amaravathi, April 27: ఆంధ్ర ప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 81 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో సోమవారం ఉదయం నాటికి రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1097 కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా కరోనా మరణాలేమి నమోదు కాకపోవడంతో మరణాల సంఖ్య 31 గానే ఉంది. ఇక ఇప్పటివరకు 231 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 835 యాక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

నిన్న ఒక్కరోజులోనే క్రిష్ణా జిల్లాలో అత్యధికంగా 52 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 177 కు చేరింది. అయితే ఇందులో 29 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, మరో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లాలో ఇప్పటికీ 140 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కర్నూలు నుంచి మరో 14 కేసులు నమోదయ్యాయి. దీంతో కర్నూలులో కోవిడ్-19 బాధితుల సంఖ్య 275 కు చేరింది. ఇందులో 31 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ కాగా, మరో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలో ప్రస్తుతం 259 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి

status of positive cases of #COVID19 in Andhra Pradesh.

శ్రీకాకుళం జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4కు పెరిగాయని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. కరోనా కట్టడి కోసం శ్రీకాకుళం జిల్లాలోనే కరోనా ల్యాబ్‌ ఏర్పాటు చేశామని, ర్యాపిడ్ యాక్షన్‌, ట్రూనాట్‌ కిట్స్‌ ద్వారా పరీక్షలు చేస్తున్నామని ఆయన తెలిపారు. జెమ్స్‌ ఆసుపత్రిని జిల్లా కోవిడ్-19‌ ఆసుపత్రిగా తీర్చిదిద్దినట్లు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా  32 క్వారంటైన్‌ కేంద్రాల్లో పూర్తి సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. పాజిటివ్ కేసులు నమోదైన పాతపట్నం ఏరియాని రెడ్‌జోన్‌గా ప్రకటించినట్లు చెప్పారు. సుమారు 50 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి రాకపోకలపై నిఘాపెట్టామని. రెడ్‌జోన్‌లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, నిత్యావసర సరుకులకు ఇంటికే చేరేలా చర్యలు చేపట్టామని ఆళ్ల నాని అక్కడి పరిస్థితులను వివరించారు.