Andhra Prdesh: ఆంధ్రప్రదేశ్‌కు పాకిన హిజాబ్ వివాదం, విజయవాడలోని ఆంధ్ర లయోల కాలేజ్‌లో హిజాబ్ ధరించిన విద్యార్థినిలను అడ్డుకున్న కాలేజీ యాజమాన్యం

ముఖ్యంగా కర్ణాటకలో ఈ వివాదం ప్రకంపనలు రేపుతోంది. కర్ణాటకలోని మొదలైన హిజాబ్ వివాదం ఆంధ్రప్రదేశ్‌కు పాకింది. విజయవాడలోని ఆంధ్ర లయోల కాలేజ్‌లో హిజాబ్ వివాదం నెలకొంది.

Karnataka Hijab Row (photo-PTI)

Amaravati, Feb 17: హిజబ్ వివాదం (Hijab Controversy) ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా కర్ణాటకలో ఈ వివాదం ప్రకంపనలు రేపుతోంది. కర్ణాటకలోని మొదలైన హిజాబ్ వివాదం ఆంధ్రప్రదేశ్‌కు పాకింది. విజయవాడలోని ఆంధ్ర లయోల కాలేజ్‌లో హిజాబ్ వివాదం నెలకొంది. హిజాబ్ వేసుకొచ్చారని కొందరు విద్యార్థినిలను కాలేజీలోకి రానీయకుండా కాలేజీ యాజమాన్యం అడ్డుకుంది.

అయితే తాము ఫస్ట్ ఇయిర్ నుండి బుర్కాలోనే కాలేజీ వెళ్తున్నామని, కాలేజీ ఐడీ కార్డులో కూడా తాము బుర్కాతోనే ఫోటో దిగామని విద్యార్థినిలు తెలిపారు. విషయం తెలిసిన ముస్లిం పెద్దలు కాలేజీ వద్దకు చేరుకుని యాజమాన్యంతో చర్చలు జరిపారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కిషోర్ అత్యుత్సాహంతోనే వివాదం చోటు చేసుకుందని, ఉద్దేశపూర్వకంగా విద్యార్ధిలను అడ్డుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. చివరకు ముస్లీం పెద్దల చర్చలతో వివాదం సమసిపోవడంతో విద్యార్ధినిలను యాజమాన్యం క్లాస్ రూంలోకి అనుమతించింది.