Andhra Pradesh: పుల్లుగా మందేసి పోలీస్ స్టేషన్‌లోనే మహిళతో పనికానిచ్చిన ఏఎస్ఐ, రెడ్ హ్యాండెడ్‌‌గా పట్టుకున్న స్థానికులు, కొత్తకోట పోలీస్ స్టేషన్‌లో ఘటన

అనకాపల్లి జిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐ అప్పారావు ఓ మహిళతో అడ్డంగా దొరికిపోయాడు. మద్యం మత్తులో ఉన్న ఏఎస్ఐ రాత్రి ఓ మహిళను పోలీస్ స్టేషన్‌కు (Anakapalle ASI caught with a woman) తీసుకువెళ్లాడు. అక్కడే రాసలీలలు జరిపాడు.

Anakapalle ASI caught with a woman in kothakota police station (Photo-Twitter)

Anakapalle, August 29: ప్రజల భద్రత చూడాల్సిన పోలీసు దారి తప్పాడు. అనకాపల్లి జిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐ అప్పారావు ఓ మహిళతో అడ్డంగా దొరికిపోయాడు. మద్యం మత్తులో ఉన్న ఏఎస్ఐ రాత్రి ఓ మహిళను పోలీస్ స్టేషన్‌కు (Anakapalle ASI caught with a woman) తీసుకువెళ్లాడు. అక్కడే రాసలీలలు జరిపాడు.

అనకాపల్లి జిల్లా పరిధిలోని కొత్తకోట పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా అప్పారావు పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి ఓ మహిళతో పీఎస్‌లో (kothakota police station ) శ‌ృంగారంలో ఉండగా అడ్డంగా దొరికిపోయాడు. పీకల దాకా మద్యం తాగిన ఏఎస్ఐ అప్పారావు.. రాత్రి సమయంలో ఓ మహిళను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. పీఎస్‌లోనే రాసలీలలు జరిపాడు. ఇది గమనించిన స్థానికులు సీఐకి సమాచారం ఇచ్చారు. వెంటనే స్టేషన్‌కు చేరుకున్న సీఐ.. అప్పారావును రెడ్ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు. మహిళను అక్కడి నుంచి పంపించివేశారు.

కోరిక తీర్చలేదని కామాంధుడు బరితెగించాడు, పాలు అమ్ముకుని తిరిగివస్తుండగా మహిళపై దాడి చేసి అత్యాచారయత్నం, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు

మహిళతో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరకడంతో తనను విడిచిపెట్టాలంటూ సీఐ కాళ్లపై పడి ఏఎస్‌ఐ అప్పారావు వేడుకున్నాడు. మద్యం సేవించి ఉండటమే కాకుండా మహిళను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి ఇలాంటి అకృత్యానికి పాల్పడడంపై పోలీస్ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం అప్పారావును అనకాపల్లి ఆస్పత్రికు తరలించారు. ఏఎస్‌ఐ తీరును స్థానిక మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఏఎస్ఐపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ స్టేషన్‌ సీఐ ఉన్నతాధికారులకు నివేదించారు.

అప్పరావుని CI అహ్మద్, SI అప్పలనాయుడు తీవ్రంగా మందలించారు. మరోవైపు ఆ మహిళ అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. అయితే ఏఎస్ఐపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది.