IPL Auction 2025 Live

Volunteers Salary Hike Row: చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్లను పీకేస్తారు, జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే రూ. 15 వేలు జీతం పెంచుతాడు, సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి విశ్వరూప్

వచ్చే ఎన్నికల్లో వైఎసార్సీపి తిరిగి అధికారంలోకి రాగానే గ్రామ వాలంటీర్లకు రూ. 15వేల వేతనం (village volunteers Salary) ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ సిద్ధంగా ఉన్నారన్నారు.

Pinipe Viswarup(Photo-Twitter)

Vjy, Jan 5: ఏపీలో ఎన్నికల సంవత్పరం ముందుగానే ఎన్నికల హీట్‌ మొదలైంది. ప్రస్తుతం జగన్‌ సర్కార్‌ అన్ని సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోంది. అభివృద్ధి కన్నా సంక్షేమ పథకాల వైపే జగన్ సర్కారు అధిక మొత్తాన్ని ఖర్చు చేసుకుంటూ వెళుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో వాలంటీర్లకు (Volunteers Salary Hike Row) శుభవార్త చెప్పారు ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్ (AP MInister Pinipe Viswarup). వచ్చే ఎన్నికల్లో వైఎసార్సీపి తిరిగి అధికారంలోకి రాగానే గ్రామ వాలంటీర్లకు రూ. 15వేల వేతనం (village volunteers Salary) ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ సిద్ధంగా ఉన్నారన్నారు.

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం, రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలు, సమావేశాలపై నిషేధం, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర హోంశాఖ

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరంలో గ్రామ వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. కష్టపడి పని చేసి రాష్ట్రంలో మళ్లీ YSRCP అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని సూచించారు. మరో పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను ఉద్యోగాల నుంచి తొలగించడం ఖాయమని హెచ్చరించారు. సంక్షేమ ఫలాలు పొందని లబ్ధిదారులను ఆరోనెలలకు ఒకసారి గుర్తిస్తూ, వారికి పథకాలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుతోందన్నారు మంత్రి విశ్వరూప్.

ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గ్రామ,వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి సీఎం జగన్ ఆమోదం, గ్రామ, వార్డు సచివాలయాలపై ముఖ్యమంత్రి సమీక్ష

నియోజకవర్గ పరిధిలో 1200 మందికి నూతనంగా పింఛన్లు మంజూరు చేశామని తెలిపారు. పేదరికమే ప్రామాణికంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పింఛను ఇస్తోందని గుర్తు చేశారు. పింఛన్లు తొలగింపు అనేది దుష్ప్రచారమేనని.. ఎవరూ నమ్మొద్దన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచుతూ వస్తున్నారన్నారు.2019లో 39 లక్షలు ఉన్న పింఛన్లను ప్రస్తుతం 64 లక్షలకు పెంచారన్నారు.