AP Government logo (Photo-Wikimedia Commons)

Vjy, Jan 3: రహదారులపై సమావేశాలతో ప్రాణ నష్టం జరుగుతుండటంతో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh Govt Bans Rallies) నిషేధించింది. ఇకపై జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్‌ రహదారులపైన, మార్జిన్లలో సభలు, ర్యాలీలకు అనుమతించేది లేదని (Meetings on Public Roads) స్పష్టంచేసింది. అత్యంత అరుదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు లేదా పోలీస్‌ కమిషనర్లు కచ్చితమైన షరతులతో అనుమతి ఇవ్వొచ్చంటూ మినహాయింపునిచ్చింది.ఈమేరకు రాష్ట్ర హోం శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

1861 పోలీస్‌ చట్టం ప్రకారం హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్‌ కుమార్‌ గుప్తా సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలతో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తుండటంతోపాటు, వాటి నిర్వహణలో లోటుపాట్లు, నిర్వాహకుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను బలిగొంటున్న నేపథ్యంలో 30 పోలీస్‌ యాక్ట్‌ను అమలు చేస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

మీకిచ్చిన హామీని మీ బిడ్డ నిలబెట్టుకున్నాడు, గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడాలను గమనించాలని పిలుపునిచ్చిన సీఎం జగన్, రాజమండ్రి టూర్ లైవ్ అప్ డేట్స్ ఇవే..

రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్‌ రహదారులు పూర్తిగా ప్రజల రాకపోకలు, సరుకు రవాణా కోసమే ఉపయోగించాలని స్పష్టం చేసింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సభల నిర్వ­హణకు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేయా­లని ప్రభుత్వం జిల్లాల ఉన్నతాధికారులకు సూచించింది.రహదారులకు దూరంగా, సాధారణ ప్రజ­లకు ఇబ్బంది కలగకుండా సరైన ప్రదేశాలను ఎంపిక చేయాలని పేర్కొంది. వివిధ పార్టీలు, ఇతర సంస్థలు సభలను ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించుకోవచ్చని చెప్పింది.

ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కారు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు, సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, BRSలో చేరిన మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, తోట చంద్రశేఖర్, పార్థసారధి

రాష్ట్రంలో రహదారులపై నియంత్రణ లేకుండా సభలు, ర్యాలీల నిర్వహణ వల్ల సామాన్య ప్రజానీకం ప్రాణాలు కోల్పోతున్నారు. పలువురు తీవ్రంగా గాయపడతున్నారు. ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా కందుకూరులో రోడ్డుపై టీడీపీ నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది సామాన్యులు దుర్మరణం చెందారు. గుంటూరు జిల్లాలో టీడీపీ నిర్వహించిన సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమంలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.

ఈ రెండు దుర్ఘటనల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రహదారులను ఆక్రమించి వేదికల నిర్మాణం, ఇష్టానుసారం ఫ్లెక్సీలు, సౌండ్‌ సిస్టమ్స్‌ ఏర్పాటు, చివరి నిమిషాల్లో రూట్‌ మ్యాప్‌ల మార్పు, ఇరుకుగా బారికేడ్ల నిర్మాణం మొదలైన లోపాలతో ఈ రెండు దుర్ఘటనలు జరిగాయని అధికారులు నిర్ధారించారు. ఈ దుర్ఘటనలపై మెజిస్టీరియల్‌ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీల నిర్వహణపై నియంత్రణ విధించింది.