Hyd, Jan 2: తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నేతలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు (Former BJP Leader Ravela Kishore Babu), తోట చంద్రశేఖర్, పార్థసారధి బీఆర్‌ఎస్‌లోకి చేరారు. సీఎం కేసీఆర్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు టీజే ప్రకాశ్(అనంతపురం), తాడివాక రమేశ్ నాయుడు(కాపునాడు, జాతీయ అధ్యక్షుడు), గిద్దల శ్రీనివాస్ నాయుడు(కాపునాడు, ప్రధాన కార్యదర్శి), రామారావు(ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు) కూడా బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఏపీలోకి బీఆర్ఎస్ (BRS Makes Foray Into AP) ప్రవేశించినట్లయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను (former IAS officer Thota Chandrasekhar) నియమిస్తూ సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. రావెల కిశోర్ జాతీయ స్థాయిలో పని చేయాల్సిన వ్యక్తి అని తెలిపారు. పార్థసారథి (former IRS officer Chintala Partha Sarathi ) సేవలు కూడా ఉపయోగించుకుంటాం. ఇవాళ మాకు మంచి వజ్రాలు దొరికాయని భావిస్తున్నాను. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంచి పనిని చేసుకుంటున్నాం అని కేసీఆర్ తెలిపారు. ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ తెలిపారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ అజెండాను దేశవ్యాప్తం చేయాలన్నారు. పార్టీలో చేరిన నేతలపై పెద్ద బాధ్యత పెడుతున్నామన్నారు. భారతదేశంలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదన్నారు.స్వాతంత్య్ర ఫలాలు పూర్తిస్థాయిలో సిద్ధించలేదు. భారతదేశ లక్ష్యాలు ఇంకా నెరవేరలేదు. ఒకప్పుడు రాజకీయాలు అంటే త్యాగం చేయాల్సి ఉండేది. దేశ రాజధానిలో రైతులు ధర్నాలు చేయడం చూస్తున్నాం. వనరులు, వసతులు ఉండి దేశ ప్రజలు ఎందుకు శిక్షింపబడాలి?. బీఆర్‌ఎస్ ఈజ్ ఫర్ ఇండియా’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
తోట చంద్రశేఖర్ వారి కర్తవ్య నిర్వహణలో పూర్తిగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. వారు విజయం సాధిస్తారు అని సీఎం కేసీఆర్ తెలిపారు.సంక్రాంతి మరునాడు నుంచి తట్టుకోలేనంత ఒత్తిడి వస్తుంది. వండర్‌ఫుల్‌గా మనం పురోగమించే అవకాశం ఉంది. ఆశ్చర్యపరిచే చేరికలు త్వరలోనే ఉంటాయి. నిన్న చాలాసేపు మాట్లాడం. ఒక పంథా వేసుకున్నాం. ఆ దిశగా పురోగమించేందుకు జాతీయస్థాయిలో కిశోర్ పని చేస్తారు. చాలా గొప్పవారు కూడా ఫోన్లు చేశారు. ఏపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఫోన్లు చేస్తున్నారు. మీరు సిట్టింగ్ కదా అని అడిగితే మేం ఫిట్టింగ్ లేమని చెబుతున్నారు. ఏపీలో పార్టీ బరువు, బాధ్యత చంద్రశేఖర్‌పై ఉంటుంది. వారికి పరిపాలన అనుభవం ఉంది. అవకాశం కలిగింది.. ఇక తడాఖా చూపించడమే తరువాయి అని కేసీఆర్ పేర్కొన్నారు.