CM-YS-JAGAN (Photo-Video Grab)

Rajahmundry, Jan 3: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ(మంగళవారం) తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటించారు. వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ లబ్ధిదారులతో మాట్లాడిన సీఎం అనంతరం సభా వేదికపై మాట్లాడారు. ఈ జిల్లాకు 9,147 అదనపు పెన్షన్లు మంజూరు అయ్యాయి.కాగా రాష్ట్రవ్యాప్తంగా రూ. 2,750 పెన్షన్‌ పెంపుతో లబ్ధిదారుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్న సంగతి విదితమే.

పింఛన్లు పెంచుకుంటూ పోతామన్న హామీని మీ బిడ్డగా నిలబెట్టుకున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రాజమండ్రిలో పింఛన్‌ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆర్ట్స్‌ కాలేజ్‌ గ్రౌండ్‌లో బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పింఛన్లు కేవలం వృద్ధులకు మాత్రమే కాదు.. రకరకాల సమస్యలతో బాధపడుతున్న అర్హులైన వాళ్లందరికీ అందుతున్నాయి.

ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కారు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు, సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, BRSలో చేరిన మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, తోట చంద్రశేఖర్, పార్థసారధి

ప్రభుత్వం తరపున పేదలకు అందిస్తున్న ఆ పెన్షన్‌ సాయం దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో అందడం లేదని, అది మీ బిడ్డ పరిపాలనలోనే జరుగుతోందని సీఎం జగన్‌ సగర్వంగా ప్రకటించుకున్నారు. కొత్తగా మరికొందరికి పింఛన్లు జాబితాలో చేర్చామని, అందుకోసం నిధులను సైతం ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేశారు. కొత్తగా బియ్యం కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు వలంటీర్లు ఇంటికి వెళ్లి మరీ అందిస్తున్నారని ఆయన ప్రకటించారు.

చంద్రబాబు ప్రచార పిచ్చికి పేదలు బలి, మరణాలన్నిటికి చంద్రబాబు బాధ్యత వహించాలి, బాధితులను పరామర్శించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి రజిని

పింఛన్లు రూ. 2,500 నుంచి రూ.2,750కి పెంచాం. ఖర్చుకు వెనకాడకుండా లబ్ధిదారుల సంక్షేమం కోసం పాడుపడుతున్నాం. గత ప్రభుత్వంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్‌ అందేది.. మేం అధికారంలోకి వచ్చాక ఆ సంఖ్య పెరిగింది. ఇప్పుడు ఏకంగా 64 లక్షల మందికి పెన్షన్‌ అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో పెన్షన్ల కోసం చేసిన ఖర్చు కేవలం రూ.400 కోట్లు. ఈ ప్రభుత్వంలో పెన్షన్లకే రూ.1,765 కోట్లు ఇస్తున్నాం. దేశంలో రూ. 2,750 నుంచి పదివేల రూపాయల దాకా పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే.

గత ప్రభుత్వంలో పింఛన్లు కావాలంటే.. జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. లంచాలు చెల్లించాల్సిన పరిస్థితి. కానీ, ఇప్పుడు గత ప్రభుత్వంలో మాదిరి పింఛన్ల విషయంలో వివక్ష లేదు, అవినీతికి తావు లేదు, కత్తిరింపులు లేవు, ఎగ్గొట్టడాలు లేవు. ఇప్పుడు.. ఎక్కడా ఎలాంటి తారతమ్యాలు లేకుండా కేవలం అర్హత అనే దాని ప్రామాణికంగా పింఛన్‌ అందిస్తున్న వ్యవస్థ మీ బిడ్డ హయాంలో జరుగుతోంది. ఇది మనసున్న పరిపాలన. చెడు చేసిన వాళ్లకు సైతం మంచి చేయాలనే తపనే తప్ప మరొక ఉద్దేశ్యమే కనిపించదని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడాలను గమనించాలని లబ్ధిదారులను ఉద్దేశించి సీఎం వైఎస్‌ జగన్‌ పిలుపు ఇచ్చారు.

సభలో సంక్షేమ పథకాల లబ్ధిదారు కోటా సామ్రాజ్యం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హయాంలో నా భర్త చనిపోయాడు. నాకు ఇద్దరు పిల్లలు. భర్త చనిపోవడంతో రోడ్డుమీద పడ్డ నన్ను ఎవరూ పట్టించుకోలేదు. గత ప్రభుత్వం హయాంలో జన్మభూమి కమిటీలో నేను తిరగని రోజే లేదు. రోజూ వెళ్లి చెట్లకింద కూర్చుని పెన్షన్‌ దరఖాస్తు చేశాను. ఎవరూ మమ్మల్నీ పట్టించుకోలేదు. తిరిగి తిరిగి విసుగొచ్చి మేమే మానుకున్నాం. ఎప్పుడైతే మీరు సీఎం అయ్యారో, ఎప్పుడైతే మన ప్రభుత్వం వచ్చిందే.. వాలంటీరు నేరుగా మా ఇంటికే వచ్చారు. వితంతు పెన్షన్‌కు నేను దరఖాస్తు చేసుకున్నాను. ఏడాదిన్నర తిరిగితే రాని పెన్షన్‌ ఒక్క నెలకే వచ్చింది. ప్రతి నెల 1వ తేదీన వాలంటీరు వచ్చి మా చేతిలే పెన్షన్‌ డబ్బులు పెడుతుంటే పండగలాగా అనిపిస్తోంది’ అని తనకు అందుతున్న సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుని సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం జగన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

పేదలకు మా ప్రభుత్వం అండగా నిలిచింది: సీఎం జగన్‌

పెన్షన్‌ను నెలకు రూ. 2,750కి పెంచాం

64 లక్షల మంది కుటుంబాలకు పెన్షన్‌ అందిస్తున్నాం

పెన్షన్లు పెంచుతూ పోతామన్న హామీని నిలబెట్టుకున్నాం

ఈ స్థాయిలో పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ

అర్హులకు బియ్యం కార్డులు, ఆరోగ్య శ్రీ కారుడు, ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం

30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చాం

గత ప్రభుత్వంలో కేవలం రూ. వెయ్యి మాత్రమే పెన్షన్‌ ఇచ్చేవారు

గత ప్రభుత్వంలో కేవంల 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్‌

మేం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్‌దారుల సంఖ్య పెరిగింది

పెన్షన్‌ కోసం నెలకు రూ. 1765 కోట్లు ఖర్చు చేస్తున్నాం

మూడున్నరేళ్లలో పెన్షన్ల కోసం రూ. 62, 500 కోట్లు ఖర్చే చేశాం

గతంలో మాదిరిగా ఎక్కడా వివక్ష లేదు, లంచాలు లేవు

అవ్వా తాతలు, అక్క చెల్లెమ్మలు ఆనందంగా పెన్షన్‌ పొందుతున్నారు

రూ. 2,750 నుంచి రూ. 10 వేల వరకూ పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ

అర్హత ఉన్న లబ్ధిదారులందరికీ పెన్షన్‌ ఇస్తున్నాం

గత ప్రభుత్వంలో నెలకు పెన్షన్ల ఖర్చు కేవలం రూ. 400 కోట్లు

మా ప్రభుత్వంలో నెలకు పెన్షన్లకే రూ. 1,765 కోట్లు ఇస్తున్నాం