RTC Charges Hike In AP: ఏపీలో బస్సు ఛార్జీలు పెంపు, ప్రతి కిలో మీటర్‌కు 10 పైసలు పెరుగుదల, ఆర్టీసీని బతికించుకోవాలంటే పెంచక తప్పదంటున్న రవాణా మంత్రి పేర్ని నాని

బస్సు చార్జీల పెంపు నిర్ణయానికి ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS Jagan) ఆమోద ముద్ర వేశారు. ఈ విషయాన్ని ఏపీ రవాణా శాఖా మంత్రి పేర్ని నాని(perni nani) వెల్లడించారు. పల్లె వెలుగు, సిటి సర్వీస్ లపై ప్రతి కిలో మీటర్ కు 10 పైసలు, మిగతా అన్ని సర్వీస్ లకు 20 పైసలు చొప్పున పెంచారు.

AP Minister Perni Nani(Photo-Twitter)

Amaravathi, December 8: ఆంధ్రప్రదేశ్‌(Andhra pradesh)లో బస్సు ఛార్జీలు పెరిగాయి. బస్సు చార్జీల పెంపు నిర్ణయానికి ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS Jagan) ఆమోద ముద్ర వేశారు. ఈ విషయాన్ని ఏపీ రవాణా శాఖా మంత్రి పేర్ని నాని(perni nani) వెల్లడించారు. పల్లె వెలుగు, సిటి సర్వీస్ లపై ప్రతి కిలో మీటర్ కు 10 పైసలు, మిగతా అన్ని సర్వీస్ లకు 20 పైసలు చొప్పున పెంచారు.

పెరిగిన ధరలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనేది త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి చెప్పారు. ఆర్టీసీ(RTC)ని నష్టాల నుంచి గట్టెక్కించాలంటే చార్జీల పెంపు తప్పదని మంత్రి తేల్చి చెప్పారు. ఏటా ఆర్టీసీకి రూ.1200 కోట్ల నష్టం వస్తోందన్నారు. ప్రస్తుతం ఆర్టీసీకి రూ.6వేల 735 కోట్ల అప్పు ఉందన్నారు.

ఇలానే నష్టాల్లో కొనసాగితే ఆర్టీసీ దివాళా తీసే పరిస్థితి వస్తుందన్నారు. 2015 లో డీజిల్ ధర రూ.50 ఉంటే నేడు రూ.75 కు పెరిగిందని మంత్రి అన్నారు. ఉద్యోగుల జీతభత్యాలు, పీఆర్సీ భారంగా మారాయన్నారు. 2015 తర్వాత ఇప్పటివరకు ఆర్టీసీ చార్జీలు పెంచలేదని మంత్రి తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీని బతికించుకోవడానికి చార్జీలు పెంచడం జరిగిందన్నారు. కాగా, చార్జీల పెంపుతో ప్రయాణికులపై అదనపు భారం పడనుంది.

ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం చేస్తూనే.. ప్రజల గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందని మంత్రి పేర్ని నాని తెలిపారు.ఆర్టీసీ విభజన ప్రక్రియ పూర్తవలేదని.. తెలంగాణతో ఆస్తులు పంపకాల ప్రక్రియ మిగిలే ఉందని చెప్పారు. షిలాబిడే కమిటీ ప్రతిపాదనలు అమలుకాలేదని గుర్తుచేశారు.

ఆర్టీసీలో 31 శాతం వాటా ఉన్న కేంద్రం.. అప్పులపై మాత్రం మాట్లాడటం లేదన్నారు.ఇప్పటికీ ఆర్టీసీలో 23 శాతం అద్దె బస్సులు తిరుగుతున్నాయని మంత్రి చెప్పారు. వాస్తవానికి బోర్డు 35 శాతం బస్సులు తిప్పేందుకు అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.

కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు ప్రవేశపెడతామని, ఏప్రిల్‌లో వెయ్యి బస్సులు కొనుగోలు చేస్తామని మంత్రి తెలిపారు. వెయ్యిలో మార్చి వరకు 240 బస్సులు అందుబాటులోకి వస్తాయని, ఫిట్ నెస్ ఉన్న బస్సులనే రూట్లలో తిప్పుతామని మంత్రి పేర్ని నాని అన్నారు. 12 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సుల స్థానంలో కొత్త బస్సులను తీసుకొస్తామని చెప్పారు. ఆర్టీసీ సంస్థ నిర్ణయం మేరకు కొత్త బస్సులను తీసుకుంటున్నామని చెప్పారు. తమకు ప్రయాణికుల భద్రతే ముఖ్యమని తెలిపారు.

ఇదిలా ఉంటే ఇటీవలే తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు పెంచిన సంగతి తెలిసిందే. 50 రోజుల కార్మికుల సమ్మె కారణంగా ఆర్టీసీకి తీవ్ర నష్టాలు వచ్చాయని చెబుతూ కేసీఆర్ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచింది.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif