AP Assembly Budget Session 2022: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ హరిచందన్‌, అనంతరం సభ వాయిదా

రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ (ndhra Pradesh Governor) ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదా పడనుంది. తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం జరుగనుంది.

Andhra pradesh Assembly Session for Three Capitals Confirmed on 20th(photo-PTI)

Amaravati, Mar 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Budget Session 2022) మరికొద్ది సేపట్లో ప్రారంభంకానున్నాయి. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ (ndhra Pradesh Governor) ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదా పడనుంది. తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా అసెంబ్లీ షెడ్యూల్‌ను ఖరారు చేస్తారు.బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 20 బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అసెంబ్లీలో ప్రసంగించడం ఇదే మొదటిసారి.

కరోనా కారణంగా 2020, 2021 బడ్జెట్‌ సమావేశాల సమయంలో వర్చువల్‌ విధానంలో మాట్లాడారు. తాజాగా గవర్నర్‌ ప్రసంగం అనంతరం బడ్జెట్‌ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై బీఏసీ నిర్ణయం తీసుకోనుంది. బీఏసీ సమావేశం ముగిశాక వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమవుతుంది. శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులపై చర్చించి ఆమోదించనుంది. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణతోపాటు పలు అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.

పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే, ప్రాజెక్టు మధ్యలో మరోసారి పర్యటిస్తానని తెలిపిన కేంద్ర మంత్రి షెకావత్, కొనసాగుతున్న సీఎం జగన్ పోలవరం పర్యటన

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతిపై శాసనసభలో మంగళవారం సంతాప తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. అదే రోజు స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన శాసనసభ సలహా కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది. సమావేశాల ఎజెండా, ఎన్ని రోజులు సభ నిర్వహించాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటారు. బుధ, గురువారాల్లో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. 11న (శుక్రవారం) 2022-23 బడ్జెట్‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో ప్రవేశపెడతారు. సమావేశాలు 25వ తేదీదాకా లేదంటే నెలాఖరు వరకు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.



సంబంధిత వార్తలు

Nara Devansh Set A Record In Chess: నారా దేవాన్ష్ టాలెంట్ కు ప్ర‌పంచం ఫిదా, 9 ఏళ్ల వ‌య‌స్సులోనే స‌రికొత్త రికార్డు సృష్టించిన నారావారి వార‌సుడు

Andhra Pradesh Shocker: కొడుకును సుపారీ ఇచ్చి హత్య చేయించిన తండ్రి, కొడుకు వేధింపులు భరించలేక అడవిలోకి తీసుకెళ్లి మద్యం తాగించి హత్య...వీడియో

CM Revanth Reddy: సర్వమత సమ్మేళనంం తెలంగాణ, మత విద్వేషాలు రెచ్చగోడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి, క్రిస్టియన్ల సంక్షేమం- అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్న సీఎం

AP Weather Update: ఏపీవాసులు ఊపిరిపీల్చుకునే కబురు.. బలహీనపడిన వాయుగుండం.. తప్పిన ముప్పు.. అయితే, రెండు రోజుల్లో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif