AP Assembly: ఏపీలో ఎన్‌ఆర్‌సీ అమలు ఉండదు, ఏపీ బడ్జెట్ 2020-21తో పాటు 15 బిల్లులకు శాసనసభ ఆమోదం, అనంతరం నిరవధిక వాయిదా, అమరవీరులకు ఏపీ అసెంబ్లీ నివాళి
దాంతోపాటు ద్రవ్యవినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మూడు మాసాల బడ్జెట్ కోసం రూ. 70 వేల కోట్లకు ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 28వ తేదీన జారీ చేసింది. మూడు మాసాల గడువు దాటిపోతోంది. దీంతో అనివార్యంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను నిర్వహించింది. 2020-21 బడ్జెట్ కు ఆమోదం తెలిపింది.
Amaravati, June 17: ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ 2020-21 కు (AP 2020-21 budget bill) శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. దాంతోపాటు ద్రవ్యవినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మూడు మాసాల బడ్జెట్ కోసం రూ. 70 వేల కోట్లకు ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 28వ తేదీన జారీ చేసింది. మూడు మాసాల గడువు దాటిపోతోంది. దీంతో అనివార్యంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను నిర్వహించింది. 2020-21 బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. మళ్లీ బిల్లును శాసనమండలిలో అడ్డుకుంటారా, ఈ రోజు శాసనమండలి ముందుకు వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు, కల్నల్ సంతోష్ మృతికి ఏపీ మండలి సంతాపం
ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీని నిరవధికంగా వాయిదా (Deferred indefinitely) వేస్తున్నట్టుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.రెండు రోజుల పాటు జరిగిన 15 బిల్లులకు ఏపీ అసెంబ్లీ (Andhra pradesh Assembly) ఆమోదం తెలిపింది, బడ్జెట్, గవర్నర్ ప్రసంగాలపై ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించింది. స్వల్పకాలిక చర్చలు, ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ లేకుండా శాసనసభ సమావేశాలు ముగిశాయి. అసెంబ్లీలో అన్ని బిల్లులు మూజువాణి ఓటుతో పాస్, 3 రాజధానుల ఏర్పాటుకు మార్గం సుగమం, సీఆర్‌డీఏ చట్టం–2014 రద్దు బిల్లుకు ఆమోదం
ఇక రాష్ట్రంలో (Andhra pradesh) ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్‌ఆర్‌సీ (NRC) (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్)ను అమలు చేయబోమని ప్రభుత్వం (AP Govt)స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఎన్‌ఆర్సీ, ఎన్‌పీఆర్‌కు సంబంధించి రాష్ట్ర శాసనసభ నేడు ఒక తీర్మానం ఆమోదించింది. భోజన విరామం తర్వాత సభలో ఈ తీర్మానాన్ని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా ప్రవేశపెట్టారు. ఏపీలో మూడు రాజధానులకు సై, ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందుతుందని ప్రసంగంలో తెలిపిన గవర్నర్, ప్రసంగాన్ని బహిష్కరించిన టీడీపీ
బడ్జెట్ ఆమోదానికి ముందు సరిహద్దుల్లో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు సీఎం జగన్‌మెహన్‌రెడ్డితో పాటు శాసన సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. వారి కుటుంబాలకు సీఎం జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టారు.
‘దేశసమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడే విధి నిర్వహణ చేస్తూ, ఇండియా – చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయవద్ద ఘర్షణలో అమరులైన 20 మంది మనదేశ వీర సైనికులకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఈ శాసనసభ ఘనమైన నివాళులు అర్పిస్తోంది. మొత్తం దేశంతోపాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారందరి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తోంది. తెలుగువాడు, పక్కరాష్ట్రం తెలంగాణలోని సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్‌బాబు త్యాగం ఎప్పటికీ తెలుగు ప్రజలకు గుర్తుండిపోతుంది. వీరమరణం పొందిన మన సైనికులకు ఆత్మశాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.