Andhra Pradesh Assembly Session: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై ఏపీ అసెంబ్లీలో చర్చ, సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ రిపీల్ బిల్లు 2024 ను సభలో మంత్రి అనగాని సత్యప్రసాద్ సభలో ప్రవేశ పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భూమిపై యజమానులకు హక్కు లేకుండా చేయడమే ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఉద్దేశంగా కనబడుతోందన్నారు
Vjy, July 24: శాసనసభ మూడోరోజు సమావేశాల్లో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై ఏపీ శాసనసభలో చర్చ జరిగిం. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ రిపీల్ బిల్లు 2024 ను సభలో మంత్రి అనగాని సత్యప్రసాద్ సభలో ప్రవేశ పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భూమిపై యజమానులకు హక్కు లేకుండా చేయడమే ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఉద్దేశంగా కనబడుతోందన్నారు.ఈ బిల్లు మరిన్ని భూవివాదాలకు దారితీసేలా ఉందని చెప్పారు. పేద రైతులకు ఇబ్బంది వస్తే నేరుగా హైకోర్టుకు వెళ్లాలంటే ఎలా?అని ప్రశ్నించారు. చిన్నపాటి వివాదాలకు తలెత్తితే లాయర్ల కోసం ఖర్చులు ఎలా భరిస్తారని గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయంకరమైనదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆ చట్టం రద్దు బిల్లుపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో భూ యజమానులకు చాలా సమస్యలు వచ్చాయన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేస్తే న్యాయవాదులు ఎక్కడికక్కడ ఆందోళన చేపట్టారన్నారు. ఆ చట్టం వచ్చి ఉంటే పౌరుల ఆస్తి హక్కును మింగేసే పరిస్థితి తలెత్తేదని సీఎం వ్యాఖ్యానించారు. రేపు మేము అధికారంలోకి వస్తాం, ఢిల్లీ వేదికగా జగన్ మాస్ వార్నింగ్, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని జాతీయ పార్టీలకు వైసీపీ అధినేత విజ్ఞప్తి
రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూ వివాదాలు పెరిగి పోయాయన్నారు. ఈ ఐదేళ్లలో కుప్పంలో కూడా భూ వివాదాలుపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఏదైనా భూమిని 22 ఏ అని వేస్తే అది ప్రభుత్వ భూమి అయిపోతుంది అని.. ప్రభుత్వం ఒప్పకుంటే మరలా ప్రైవేటు భూమిగా మార్చేస్తారని తెలిపారు. నేరస్తుల దగ్గర టెక్నాలజీ ఉంటే రికార్డులు మార్చడం ఈజీ అయిపోయిందని విమర్శించారు. భూమి తరతరాలుగా వారసత్వం ప్రకారం వస్తోందన్నారు. భూమికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తామని.. రాజముద్ర వేస్తామని.. సీఎం బొమ్మవేసి అప్పట్లో పాస్ పుస్తకాలు ఇచ్చారని సీఎం వెల్లడించారు.
భూసర్వే ద్వారా వివాదాలు పెరిగాయని... అందుకే హోల్డ్ చేసినట్లు వెల్లడించారు. ఈ చట్టం వల్ల పౌరుల ఆస్తి మొత్తం లాగేసే పరిస్ధితి ఉందన్నారు. ఎంతమంది హైకోర్టుకు భూ వివాదాలపై వెళ్లగలుగుతారని ప్రశ్నించారు. సాక్షిలో పనిచేసే వారినందరిని ప్రభుత్వంలో పెట్టారని విమర్శించారు. వారి గుమస్తాలను పెడితే మన జాతకాలు వాళ్లు రాస్తారన్నారు. ఎవ్వరైనా ఈ భూమి నాది అంటే అది ల్యాండ్ ట్రిబ్యూనల్‌కు వెళ్లిపోతుంద్నారు. తద్వారా ప్రైవేటు ఆస్తులు లాగేయాలని చూశారని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ చట్టం వారసత్వ చట్టానికి విరుద్దంగా ఉందన్నారు. ఈ చట్టంలో ఉన్న పలు సెక్షన్‌లు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయన్నారు. రెండు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు బిల్లులకు సభ ఏకగ్రీవంగా ఆమోదం
ఈ చట్టానికి సంబందించి తెచ్చిన 512 జీవోను రహస్యంగా ఉంచారని తెలిపారు. తాము వచ్చాక చట్టాన్ని రద్దు చేస్తామన్నామని అన్నారు. ఇతర దేశాల్లో ఉన్నవారి భూములు రికార్డులు మార్చితే రెండేళ్ల గుర్తించకపోతే డీమ్డ్ టూ బి అని పెట్టేశారన్నారు. ఈ నల్ల చట్టానికి సభ్యలు అందరూ కలిసి మంగళంపాడాలి అని కొరుతున్నా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.అనంతరం ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రిపీల్ బిల్లు 2024ను ఏపీ శాసనసభ ఆమోదించింది.