AP Assembly Winter Session 3rd Day: చరిత్రాత్మక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం, బిల్లులపై చర్చ చేపట్టలేదంటూ టీడీపీ వాకౌట్, నేడు అసెంబ్లీలో చర్చకు రానున్న 11 బిల్లులు

నేటి సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్‌ను (Electricity Duty Bill) మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సభలో ప్రవేశపెట్టారు. అసైన్డ్‌ ల్యాండ్స్‌ సవరణ చట్టాన్ని (Assigned Lands Amendment Act) ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ ప్రవేశపెట్టారు. ఏపీ వ్యాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌ థర్డ్‌ అమైన్‌మెంట్‌ను (AP Value Added Tax Third Aminement) బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లును ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రవేశపెట్టారు.

andhra-pradesh-speaker-tammineni-sitaram-fires-tdp-members (Photo-Flie Image)

Amaravati, Dec 2: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ శీతాకాల సమావేశాలు మూడో రోజు బుధవారం ఉదయం (AP Assembly Winter Session 3rd Day) ప్రారంభమయ్యాయి. నేటి సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్‌ను (Electricity Duty Bill) మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సభలో ప్రవేశపెట్టారు. అసైన్డ్‌ ల్యాండ్స్‌ సవరణ చట్టాన్ని (Assigned Lands Amendment Act) ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ ప్రవేశపెట్టారు. ఏపీ వ్యాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌ థర్డ్‌ అమైన్‌మెంట్‌ను (AP Value Added Tax Third Aminement) బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లును ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రవేశపెట్టారు.

యానిమల్‌ ఫీడ్‌, క్వాలిటీ కంట్రోల్‌ బిల్లును (Animal Feed, Quality Control Bill) కూడా శాసనసభ ఆమోదించింది. మంత్రి సీదిరి అప్పలరాజు సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.హోంమంత్రి మేకతోటి సుచరిత దిశ బిల్లును (Disha Bill) ప్రవేశపెట్టారు. ఈ కీలక బిల్లులపై ప్రస్తుతం శాసనసభలో చర్చ జరుగుతోంది. ఇవాళ అసెంబ్లీలో11 బిల్లులు (11 Bills) చర్చకు రానున్నాయి. పోలవరం, కరోనా కట్టడి, బీసీ సంక్షేమ కార్పొరేషన్లపై శాసనసభలో చర్చించనున్నారు.

బూతు పదాలతో దద్దరిల్లిన ఏపీ అసెంబ్లీ, ఫేక్ సీఎం అంటూ జగన్‌పై చంద్రబాబు మండిపాటు, తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన మంత్రి కొడాలి నాని

ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Winter Session 2020) ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. విద్యుత్‌ సవరణ బిల్లు, అసైన్డ్‌ భూములు లీజు అంశాలపై చర్చ జరపాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే.. ఈ అంశంపై చర్చించడానికి టీడీపీ అధినేత, మాజీ సీఎం, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడికి అవకాశం ఇవ్వకపోవడంతో సభ నుంచి టీడీపీ వాకౌట్‌చేసింది.

రెండో రోజు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సస్పెండ్, అసెంబ్లీలో టీడీపీ చేస్తున్న రభసపై మండిపడుతున్న అధికార పార్టీ

అగ్రికల్చర్‌ కౌన్సిల్‌ బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇదో చారిత్రక బిల్లు అని, రైతులకు మరింత మేలు చేసేందుకు ఈ బిల్లు తీసుకొచ్చినట్టు చెప్పారు. దేశానికి వెన్నముఖగా నిలిచిన వ్యవసాయ రంగానికి కౌనిల్స్‌ అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. అగ్రికల్చర్‌ కౌన్సిల్‌ ఏర్పాటు విషయంలో ఏపీ ముందుడుగు వేసిందన్నారు. రైతులకు సరైన సూచనలు, వ్యవసాయ కార్యకలాపాలకు ఊతమిచ్చేలా ఈ బిల్లును తీసుకొచ్చమన్నారు.

ఈ బిల్లు ఉభయ తారకంగా ఉంటుం‍దని పేర్కొన్నారు. ప్రభుత్వానికి, వ్యవసాయ రంగానికి వారధిగా అగ్రికల్చర్‌ కౌన్సిల్‌ ఉంటుందన్నారు.అగ్రికల్చర్‌ కౌన్సిల్‌ ద్వారా రైతులకు విలువైన సూచనలు అందుతాయని.. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు దీని పరిధిలో ఉంటాయన్నారు. వ్యవసాయ పట్టభద్రులను ప్రైవేట్‌ ప్రాక్టీస్‌కు అనుమతిస్తామని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అనుమతులు రద్దు చేస్తామనితెలిపారు.

అసెంబ్లీ నుంచి చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్, సభలో చర్చ సాగకుండా అడ్డుపడిన టీడీపీ సభ్యులు, నేటి సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్‌ చేసిన స్పీకర్

ఏపీ ఎలక్ట్రిసిటీ సవరణ డ్యూటీ బిల్లుతో రాష్ట్రానికి మంచి జరుగుతుందని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. బిల్లు చదవకుండా ప్రతిపక్ష సభ్యులు అనవసరంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రైతులకు పగటిపూట నాణ్యమైన కరెంట్‌ ఇవ్వాలంటే సౌర విద్యుత్‌ తప్పనిసరి అన్నారు. సౌర విద్యుత్‌తో పర్యావరణానికి, రైతులకు మంచి జరుగుతుందని తెలిపారు. టీడీపీ నాయకులు కుట్రపూరితంగా మంచి పనులకు అడ్డుతగులుతున్నారని మండిపడ్డారు.

నాణ్యమైన విద్యుత్‌తోపాటు 24 గంటల కరెంట్ కోసమే ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లు ప్రవేశపెట్టినట్టు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు. చంద్రబాబు విద్యుత్‌ రంగాన్ని నష్టాల్లోకి నెట్టారని, రెండు రూపాయలకు విద్యుత్‌ దొరికే అవకాశం ఉన్నా.. రూ.4.80 పైసలకు కొనుగోలు చేశారని ఆరోపించారు. గతంలో 4 వేల మెగావాట్లకు బాబు యూనిట్‌కు సుమారు రూ.7 వరకు అగ్రిమెంట్‌ చేసుకున్నారని తెలిపారు. 4 వేల మెగావాట్లకు తాము యూనిట్‌కు రూ.2 నుంచి రూ.3 వరకు అగ్రిమెంట్ చేసుకున్నామని వెల్లడించారు.

ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లు సంబంధించి ఇంకా ఏమైనా సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాన్ని కోరారు. ఈ బిల్లుతో పేదలకు మేలు జరుగుతుందని, భూమిని స్వచ్ఛందంగా లీజుకిచ్చేందుకు ఈ బిల్లు ద్వారా అవకాశం కల్పిస్తున్నామన్నారు. లీజుకిచ్చిన ఎకరం భూమికి రూ.25 వేలు ఇస్తామన్నారు. పేదలకు మంచి జరిగే కార్యక్రమానికి చంద్రబాబు అడ్డుతగులుతున్నారని విమర్శించారు. అయితే బుగ్గన చెప్పివన్నీ అవాస్తవాలని అచ్చెన్నాయుడు అన్నారు.

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరెడ్డి ఉచిత విద్యుత్‌కు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గుర్తు చేశారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లుపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ... ఇప్పుడు సీఎం జగన్‌ 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారని అన్నారు. 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్ట్‌ మంచి నిర్ణయమని ప్రశంసించారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లులో అనేక మంచి అంశాలు ఉన్నాయని, ఈ బిల్లును సమర్థించాలని కోరారు.