YSR Cheyutha Scheme 2020: వారి బ్యాంకు అకౌంట్లోకి నేరుగా రూ.18,750, వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం వైయస్ జగన్, ఒక్కో మహిళకు నాలుగేళ్లలో రూ.75,000 ఆర్థిక సాయం
ఈ పథకం (YSR Cheyutha Scheme 2020) ద్వారా 45 ఏళ్ల వయస్సు నిండి 60 ఏళ్ల మధ్య ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750ల చొప్పున నాలుగేళ్లలో రూ.75,000 ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. అందులో భాగంగానే బుధవారం మొదటి విడత సాయంగా బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.18,750లు జమచేశారు. ఏపీ బడ్జెట్‌లో వైఎస్సార్ చేయూత పథకానికి రూ.4,700కోట్లు కేటాయించారు. దాదాపు 25లక్షల మంది మహిళలు ఈ పథకం (YSR Cheyutha) ద్వారా 4 ఏళ్లలో రూ.17 వేల కోట్లు లబ్ధిపొందనున్నారు.
Amaravati, August 12: వైఎస్సార్ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం (YSR Cheyutha Scheme 2020) ద్వారా 45 ఏళ్ల వయస్సు నిండి 60 ఏళ్ల మధ్య ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750ల చొప్పున నాలుగేళ్లలో రూ.75,000 ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.
అందులో భాగంగానే బుధవారం మొదటి విడత సాయంగా బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.18,750లు జమచేశారు. ఏపీ బడ్జెట్‌లో వైఎస్సార్ చేయూత పథకానికి రూ.4,700కోట్లు కేటాయించారు. దాదాపు 25లక్షల మంది మహిళలు ఈ పథకం (YSR Cheyutha) ద్వారా 4 ఏళ్లలో రూ.17 వేల కోట్లు లబ్ధిపొందనున్నారు.
ఈ సందర్భంగా ఏపీ సీఎం మాట్లాడుతూ.. వైఎస్సార్ చేయూతను (YSR Cheyutha Scheme) ప్రారంభించడం నా అదృష్టం. 45 నుంచి 60 ఏళ్ల మహిళలకు ఏ పథకం లేదు. వైఎస్సార్ చేయూత ద్వారా వారి కుటుంబాలకు మంచి జరగాలి. వీరికి ప్రభుత్వానికి సంబంధించి ఏ పథకమూ లేదు. కానీ కుటుంబాలను నడిపించే బాధ్యత వీరిదే. వీరికి మంచి జరిగితే.. కుటుంబానికి మొత్తానికి మంచి జరిగినట్టే. వీరికి మంచి జరగాలనే ఈ పథకం తెచ్చామని అన్నారు.నాలుగేళ్లపాటు చేయిపట్టుకుని నడిపిస్తాం అని చెప్పి ఈ పథకాన్ని తీసుకువచ్చామని తెలిపారు.
Update by ANI
ప్రతి ఏటా రూ.18,750 చొప్పున రూ.75వేలు ఇస్తున్నాం. తమ జీవితాలను మార్పు చేసుకునే అవకాశం మహిళలకు వస్తుంది. దీన్ని ఎన్నికల ప్రణాళికలో పెట్టాం. అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి పథకాన్ని వర్తింపు చేస్తామని చెప్పాం. మీ తమ్ముడిగా, అన్నగా చేయగలుగుతున్నాం. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పదవీ బాధ్యతలు స్వీకరణ, రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదని వెల్లడి
ఈ పథకంలో ఒక అడుగు ముందుకు వేశాం. అక్కల అకౌంట్లోకి నేరుగా బదిలీచేస్తున్నాం. పాత అప్పులకి జమచేసుకోకుండా అన్‌ఇన్‌కంబర్డ్ బ్యాంకు ఖాతాల్లోకి పంపుతున్నాం. దీనికోసం బ్యాంకులతో మాట్లాడాం. దీంతో ఇంకో అడుగు ముందుకు వేశాం. అక్కలకు, చెల్లెమ్మలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ముందడుగు వేశామన్నారు. వైఎస్సార్ చేయూత, పేద మహిళలను గుర్తించడం ఎలా ?
చేయూత లబ్ధిదారుల సాధికారిత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అమూల్, ఐటీసీ, హెచ్‌యూఎల్, పీ అండ్ జీ, జియోమార్ట్ లాంటి ప్రఖ్యాత, దిగ్గజ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఔత్సాహిక వ్యాపారస్తులుగా మారడానికి అవసరమైన సాంకేతిక, మార్కెటింగ్ సహకారాలను ఈ కంపెనీలు అందిస్తాయి. సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం అవకాశాలను కల్పిస్తాయి. వైఎస్సార్ చేయూత ద్వారా దాదాపు 25 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు మేలు జరుగుతుంది. ఈ కంపెనీల భాగస్వామ్యం వల్ల వారికి జీవనోపాధి కలగడమే కాకుండా, గ్రామీణ స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోనున్నాయి.