Ram Madhav Sensational Comments on Chandrababu Naidu (Photo-Rammadhav twitter)

Vijayawada, August 11: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు మంగళవారం బాధ్యతలు (Somu Veerraju sworn-in as AP BJP President) స్వీకరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, బీజేపీ రాష్ట్ర సహాయ ఇంచార్జ్ సునీల్ డియోదర్, మధుకర్ జీ, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రి మాణిక్యాలరావు, స్వర్ణపాలెస్ ప్రమాద మృతులకు బీజేపీ నేతలు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోము వీర్రాజు (Somu Veerraju) మాట్లాడుతూ రాష్ట్ర, దేశాభివృద్ధి బీజేపీ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్ అంటే అందరి జీవితాల్లో వెలుగులు నింపడమేనని ఆయన పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలను అందించాలన్నారు. ‘‘జన్‌ధన్ ఖాతా ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపాం. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే చేయాలి. ఏపీ అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుందని’’ ఆయన తెలిపారు. రాజధాని వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉందన్నారు. రాజధాని రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

Somu Veerraju sworn-in as Andhra Pradesh BJP president

ఏపీ ప్రతిపక్షం టీడీపీపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ (BJP National General Secretary Ram Madhav) విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది. ప్రతిపక్ష స్థానాన్ని బీజేపీ భర్తీ చేయాలన్నారు. ప్రధాని మోదీ భుజాలపై తుపాకీ పెట్టి యుద్ధం చేయాలని చంద్రబాబు (Chandrababu Naidu) చూశారు. హైదరాబాద్‌లో ఉండి 5 లేదా 10 ఏళ్లలో రాజధాని కట్టుకోమని చెప్పాం. ఆయన హైదరాబాద్‌ను వదిలి ఎందుకు వచ్చారో అందరికీ తెలుసు. చంద్రబాబు హయాంలో అమరావతిలో అవినీతి జరిగిందని రామ్‌మాధవ్‌ విమర్శించారు. రాజధానిని మార్చుకోండి, కేంద్రం రాజధాని మార్పు విషయంలో జోక్యం చేసుకోదని తెలిపిన ఏపీ బీజీపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

ఏపీలో బీజేపీ (BJP) అధికారంలోకి రావడం అంత సులభం కాదని.. రాష్ట్ర బీజేపీని సోము వీర్రాజు మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ అన్నారు. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా బీజేపీ ఎదగాలన్నారు. రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్రం అడ్డుకోలేదు. రాజధాని అంశంపై కేంద్రం ఏనాడు జోక్యం చేసుకోలేదు. కేంద్రం తన పరిధిలోనే వ్యవహరించిందని’’ రామ్‌మాధవ్ పేర్కొన్నారు.‌