YSR Cheyutha Scheme 2020: వైఎస్సార్‌ చేయూత నేడే లాంచ్, పథకం ద్వారా నాలుగేళ్లకు రూ. 75 వేలు మహిళల అకౌంట్లోకి, నేడు తొలి ధపా మొత్తం రూ.18,750 విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం
AP Chief Minister Y.S. Jagan Mohan Reddy (photo-Twitter)

Amaravati, August 12: పరిపాలనలో ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా దూసుకుపోతున్న ఏపీ సీఎం (Chief Minister Y.S. Jagan Mohan Reddy) సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తున్నారు. ఇప్పటికే పలు పథకాల ద్వారా ప్రజాభిమానాన్ని చూరగొన్న ఏపీ సీఎం తాజాగా మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉద్ధేశించిన వైఎస్సార్‌ చేయూత పథకాన్ని(YSR Cheyutha Scheme 2020) నేడు ప్రారంభించనున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో( CM Camp Office) వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు ఈ పథకాన్ని(YSR Cheyutha) ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్ల కాలంలో రూ. 75,000 లను మహిళలకు ఉచితంగా ప్రభుత్వం అందించనుంది. దాదాపు 25 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు.

వ్యవసాయం, ఉద్యానవనం, పశుపోషణ, హస్తకళలు, చిరు వ్యాపారాలు, చేనేత.. తదితర రంగాల్లో ఉన్న మహిళల ఆర్థిక ప్రగతి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. 2019 ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌ 14 నెలలపాటు 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఈ హామీని ఇచ్చారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మహిళలకు స్థిరమైన ఆదాయమార్గాల ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించడానికి వైఎస్‌ జగన్, వైయస్సార్‌ చేయూత (YSR Jagananna Cheyutha Scheme 2020) పథకాన్ని వర్తింప చేస్తామంటూ పాదయాత్రలో హామీ ఇచ్చారు. దీన్ని పార్టీ మేనిఫెస్టోలో కూడా చేర్చారు. నవంబర్ 16వ తేదీ నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, జనవరి 15వ తేదీన ఓటర్ల తుది జాబితా, ఏపీ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ వెల్లడి

ఈ పథకం (YSR Cheyutha Scheme) కింద ఏడాదికి రూ.18,750 చొప్పున 4 ఏళ్లలో రూ.75 వేలు వారికి అందించడం జరుగుతుంది. వైయస్సార్ చేయూత కింద డబ్బు చేతికి అందగానే దేని కోసం వినియోగించాలన్నది మహిళల చేతుల్లో ఉంటుంది. దీనిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. జీవనోపాధి కోసం చిన్న, మధ్యతరహా వ్యాపారాలనూ ఈ మొత్తం ద్వారా నడుపుకోవచ్చు. చేయూత లబ్ధిదారుల సాధికారిత కోసం ప్రభుత్వం ఇప్పటికే అమూల్, ఐటీసీ, హెచ్‌యూఎల్, పీ అండ్‌ జీ, జియోమార్ట్‌ లాంటి ప్రఖ్యాత, దిగ్గజ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఏపీలో కొత్త పారిశ్రామిక పాలసీని ఆవిష్కరించిన మంత్రి గౌతమ్‌రెడ్డి, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా నూతన పారిశ్రామిక పాలసీ

మహిళలు ఔత్సాహిక వ్యాపారస్తులుగా మారడానికి అవసరమైన సాంకేతిక, మార్కెటింగ్‌ సహకారాలను ఈ కంపెనీలు అందిస్తాయి. సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం అవకాశాలను కల్పిస్తాయి. వైఎస్సార్‌ చేయూత ద్వారా దాదాపు 25 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు మేలు జరుగుతుంది. ఒక్క చేయూత ద్వారానే నాలుగేళ్ల కాలంలో నేరుగా దాదాపు రూ.18,000 కోట్లు నేరుగా మహిళల చేతికే ఉచితంగా అందుతాయి. దీనికి అదనంగా 3–4 రెట్ల ఆర్థిక సహాయాన్ని బ్యాంకుల ద్వారా, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా లబ్ధిదారులైన మహిళలు పొందే అవకాశం ఉంటుంది. తద్వారా మహిళలు పెట్టే పెట్టుబడులు రూ.54 వేల నుంచి రూ.75 వేల కోట్ల వరకూ ఉంటుంది.

పేద మహిళలను గుర్తించడం ఎలా ?

చేయూత కింద లబ్ధి పొందుతున్న మహిళల్లో వ్యవసాయం, పశు పోషణ, చేనేత, హస్తకళలు, ఆహార ఉత్పత్తుల తయారీ, కిరాణా దుకాణాలు, చిరు వ్యాపారాలు చేసే మహిళలను గుర్తిస్తారు. వారి జీవనోపాధి కోసం మంచి ఆదాయ మార్గాలను గుర్తిస్తారు. చేయూత కింద ఉచితంగా అందే డబ్బుతోపాటు దీనికి అదనంగా బ్యాంకుల నుంచి, ఆర్థిక సంస్థల నుంచి, మెప్మా, సెర్ప్‌ పథకాల నుంచి ఆర్థిక సహాయాన్ని అందేలా చూస్తారు. హెచ్‌యూల్, ఐటీసీ, పీ అండ్‌ జీ కంపెనీల సర్వీసు లొకేషన్లలో ఉన్న వీరిని గుర్తించి మ్యాపింగ్‌ చేస్తారు. ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, స్టాకింగ్‌ మేనేజ్‌మెంట్‌లో వారికి శిక్షణ ఇస్తారు. స్థిర వ్యాపార నమూనాలను అవలంబించేలా చూస్తారు. తద్వారా స్థిరమైన ఆదాయాలు పొందేలా చర్యలు తీసుకుంటారు.

సెర్ప్, మెప్మాలు ఏం చేస్తాయంటే...?

లబ్ధిదారులను సెర్ప్, మెప్మాలతో కూడిన నోడల్‌ ఏజెన్సీ గుర్తిస్తుంది. చేయూత నుంచి అందే డబ్బుకు అదనంగా బ్యాంకులనుంచి రుణాలు వచ్చేలా సెర్ప్, మెప్మాలుచూస్తాయి. సంబంధిత శాఖల భాగస్వామ్యంతో మహిళలకు మరింత మేలు జరిగేలా చూస్తాయి. వివిధ శాఖల్లోని మిగిలిన పథకాలు కూడా వీరికి వర్తింపు చేయడం ద్వారా ఆర్థికంగా మరింత తోడ్పాటు అందేలా చూస్తాయి. ఏపీ ప్రభుత్వానికి 15 అవార్డులు, కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ 2020 అవార్డుల్లో భాగంగా రాష్ట్రానికి దక్కిన పురస్కారాలు, హర్షం వ్యక్తం చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

దీంతో పాటుగా వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సెప్టెంబరులో ప్రారంభిస్తోంది. ఏటా రూ.6,700 కోట్ల చొప్పున నాలుగేళ్ల పాటు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని 9 లక్షల స్వయం సహాయక సంఘాలకు చెందిన 90 లక్షల మందికి ఈ డబ్బును ఉచితంగా ఇవ్వనున్నారు. ఎన్నికలయ్యే నాటికి డ్వాక్రా అక్కా చెల్లెమ్మలు బకాయిపడ్డ డబ్బును నేరుగా చెల్లిస్తానంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారు. చేయూత మాదిరిగానే వైయస్సార్ ఆసరా ద్వారా కూడా మహిళల జీవితాలను మార్చాలని ప్రభుత్వం యత్నిస్తోంది. ఈ రెండు పథకాల కోసం జగన్ ప్రభుత్వం దాదాపు రూ.44 వేల కోట్లను ఖర్చు చేస్తోంది.