Voter List Revision: నవంబర్ 16వ తేదీ నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, జనవరి 15వ తేదీన ఓటర్ల తుది జాబితా, ఏపీ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ వెల్లడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 16వ తేదీ నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (Voter list revision) కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ (AP Chief Electoral Officer K.Vijayanand) సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ల నిండే యువతీ, యువకులను ఓటరుగా నమోదు చేసేందుకు దీన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ నెల 10వ తేదీ నుంచి పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణతో పాటు ఓటర్ల జాబితాల్లో అనర్హుల పేర్లను తొలగించే కార్యక్రమం చేపడతారు. అక్టోబర్‌ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను (Voter list revision in AP) పూర్తి చేస్తారు.

Voter List Revision: నవంబర్ 16వ తేదీ నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, జనవరి 15వ తేదీన ఓటర్ల తుది జాబితా, ఏపీ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ వెల్లడి
Andhra Pradesh local Body Elections 2020 | (Photo-PTI)

Amaravati, August 11: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 16వ తేదీ నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (Voter list revision) కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ (AP Chief Electoral Officer K.Vijayanand) సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ల నిండే యువతీ, యువకులను ఓటరుగా నమోదు చేసేందుకు దీన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ నెల 10వ తేదీ నుంచి పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణతో పాటు ఓటర్ల జాబితాల్లో అనర్హుల పేర్లను తొలగించే కార్యక్రమం చేపడతారు. అక్టోబర్‌ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను (Voter list revision in AP) పూర్తి చేస్తారు.

ప్రక్రియ పూర్తయిన తరువాత నవంబర్‌ 1వ తేదీ నుంచి ఫాం 1 నుంచి 8 వరకు అందుబాటులో తెస్తారు. సప్లిమెంటరీతో పాటు ముసాయిదా ఓటర్ల జాబితాను నవంబర్‌ 16వ తేదీన ప్రకటిస్తారు. అదే రోజు నుంచి వచ్చే ఏడాది జనవరి 1వ తేదీకి 18 ఏళ్లు నిండేవారితో పాటు ఓటర్ల జాబితాలో పేరులేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. మూడేళ్లకే ఓటు హక్కు, బిత్తరపోయిన తల్లిదండ్రులు, కరీంనగర్ జిల్లా ఓటరు జాబితాలో పేరు, వెంటనే తొలగించాలని కోరిన పాప తండ్రి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓటరు ఐడి కార్డు

డిసెంబర్‌ 15వ తేదీ వరకు ఓటరుగా నమోదుకు లేదా అభ్యంతరాలకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. నవంబర్‌ 28, 29, డిసెంబర్‌ 12, 13 తేదీ (శని, ఆదివారాలు)ల్లో పోలింగ్‌ కేంద్రాల్లో బూత్‌ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీలకు చెందిన బూత్‌ స్థాయి ఏజెంట్లు అందుబాటులో ఉంటారు. ఓటర్లుగా చేరేందుకు బూత్‌ స్థాయి అధికారులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రంలో 4 కోట్లను దాటిన ఓటర్ల సంఖ్య, 11 జిలాల్లో మహిళా ఓటర్లే అధికం, పెరిగి ధర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య, వివరాలను వెల్లడించిన ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి కె విజయానంద్ 

ఏదైనా మార్పులు, చేర్పులుంటే వారి దృష్టికి తీసుకెళ్లవచ్చు. దరఖాస్తులను, అభ్యంతరాలను వచ్చే ఏడాది జనవరి 5వ తేదీ నాటికి పరిష్కరిస్తారు. జనవరి 14న తుది ఓటర్ల జాబితాలో పేర్లు సక్రమంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని సరిచూసుకుంటారు. జనవరి 15వ తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు.

(The above story first appeared on LatestLY on Aug 11, 2020 01:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).