Amaravati, August 10: ఏపీలో నూతన పారిశ్రామిక విధానాన్ని మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో మంత్రి గౌతమ్‌రెడ్డి (Mekapati Goutham Reddy), ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా (Roja) సోమవారం ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (AP CM YS Jagan) ఆలోచనల ప్రతిరూపంగా, ప్రజలు, పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేసే సరికొత్త పారిశ్రామిక విధానం (AP New Industrial Policy) అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొత్త పారిశ్రామిక పాలసీని రూపొందించారు. పారిశ్రామిక, వాణిజ్య, ఆర్థిక వేత్తల ఆశాకిరణం.. పెట్టుబడిదారులు నష్టపోకుండా చర్యలపై సమదృష్టి చూపనుంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు అందించనున్నారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు (ఎమ్ఎస్ఎమ్ఈ) పెద్ద సాయంగా నిలవనుంది. పారదర్శకత, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఫార్మా, టెక్స్‌టైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెట్రోకెమికల్స్ సహా కీలక రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మెగా ప్రాజెక్టులకు పెట్టుబడి ప్రతిపాదనలకు అనుగుణంగా అదనపు రాయితీలు ఉండనున్నాయి. విజయవాడ ప్రమాదం ఎలా జరిగింది? విచారణకు రెండు కమిటీలు ఏర్పాటు, 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు, మృతుల కుటుంబాలకు కేంద్రం నుంచి రూ. 2 లక్షలు, రాష్ట్రం నుంచి రూ. 50 లక్షలు
దేశానికి, రాష్ట్రానికి సంపద సృష్టించే పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించేలా సులువైన నిబంధనలతో ‘వైఎస్సార్ ఏపీ వన్’ పేరిట సింగిల్ విండో కేంద్రం ఏర్పాటు చేశామని పారిశ్రామిక శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక వేత్తలను, నైపుణ్యం కలిగిన యువతను పరిశ్రమలకు అందించడమే లక్ష్యంగా నూతన పాలసీని తీసుకువచ్చామన్నారు. గత ప్రభుత్వం అమలుకు సాధ్యం కాని అంశాలను రూపొందించిందన్నారు.
గత ప్రభుత్వ హామీలు అమలు చేయడం జాతీయ స్థాయిలోనే సాధ్యం కాదు. అందుకే కొత్త పారిశ్రామిక విధానాన్ని సరళంగా రూపొందించామని తెలిపారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా దీన్ని అమలు చేస్తామన్నారు. కోవిడ్ పరిస్థితి ల్లో పారిశ్రామిక విధానం వచ్చే మూడేళ్లకే రూపొందించామని వివరించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజన్‌కు ఇండస్ట్రియల్ పాలసీ నిదర్శనమని ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా అన్నారు. కొత్త పాలసీతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా ఉంటుందని పేర్కొన్నారు. కొత్త పాలసీ పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా ఉంటుందన్నారు. ‘‘పలు రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే విధంగా కొత్త పాలసీ. కొత్త పాలసీ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా ఉంది. సీఎం జగన్ మహిళా పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారు.