Vijayawada Swarna Palace Fire (Photo-ANI)

Vijayawada, August 10: ఏపీలో విజయవాడలోని రమేష్‌ హాస్పిటల్‌ అనుబంధ కోవిడ్‌ సెంటర్‌లో అగ్నిప్రమాద ఘటనపై (Vijayawada Hotel Swarna Palace Fire incident) విచారణకు రెండు కమిటీలను (Two committees) నియమించామని డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని (Minister Alla Nani) తెలిపారు. ఆస్పత్రికి అనుమతులు, ఇతర అంశాలపై విచారణకు ఆరోగ్యశ్రీ సీఈవో, వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్‌లతో ఒక కమిటీ, ప్రమాదానికి కారణాలపై ఇతర అధికారులతో మరో కమిటీని నియమించినట్లు చెప్పారు.

48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఈ రెండు కమిటీలను ఆదేశించామని మినిస్టర్ తెలిపారు. ఘటనా స్థలిని సందర్శించాక మంత్రులు.. మేకతోటి సుచరిత, వెలంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని, వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు, సంబంధిత అధికారులతో విజయవాడలోని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో ఆళ్ల నాని ఆదివారం సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విజయవాడ కొవిడ్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం, 11 మంది మృతి , పలువురికి గాయాలు, భయంతో పైఅంతస్తుల నుంచి దూకిన మరికొందరు, వివరాలు ఇలా ఉన్నాయి

ఆస్పత్రి నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని (Vijayawada Swarna Palace Fire) ప్రాథమికంగా నిర్ధారించాం. ఆస్పత్రిపై గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశామని ఆళ్ల నాని తెలిపారు. రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో అన్ని ప్రైవేట్‌ కోవిడ్‌ ఆస్పత్రులపై ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తాం. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఘటనకు కారణమైనవారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రులు మేకతోటి సుచరిత, వెలంపల్లి శ్రీనివాస్‌ చెప్పారు. ఘటనపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. ఇదిలా ఉంటే కరోనా రోగులకు చికిత్స అందించేందుకు స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో రమేష్‌ ఆస్పత్రి (Ramesh Hospitals) ఏర్పాటుచేసిన ప్రైవేట్‌ కోవిడ్‌ కేంద్రానికి ఏ విధమైన అగ్నిమాపక అనుమతుల్లేవనే వార్తలు వస్తున్నాయి. టీటీడీలో కరోనా కల్లోలం, మొత్తం 743 మందికి కోవిడ్-19 పాజిటివ్, 402 మంది ఇప్పటివరకు డిశ్చార్జ్, యాక్టివ్ కేసులు 338

మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారం

ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు ఇచ్చారు. ఘటన జరిగిన వెంటనే ప్రమాద కారణాలపై ఆరా తీశారు. అగ్నిప్రమాద వివరాలను, ప్రైవేట్‌ ఆస్పత్రి హోటల్‌ను లీజుకు తీసుకుని కోవిడ్‌ పేషెంట్లను అక్కడ ఉంచిన విషయాన్ని సీఎంవో అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు. ఘటనపై లోతుగా విచారణ జరపాలని, పూర్వాపరాలను తనకు నివేదించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Here's AP CM Tweets

ప్రధాని మోదీ విచారం

‘‘విజయవాడలోని కోవిడ్‌ కేంద్రంలో అగ్నిప్రమాదం జరగడం కలచివేసింది. ఆప్తులను కోల్పోయిన వారి శోకంలో నేను కూడా పాలుపంచుకొంటున్నాను. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. అక్కడి పరిస్థితిపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో చర్చించాను. అన్ని విధాలుగాను సాయం అందిస్తామని ఆయనకు హామీ ఇచ్చాను’’ అని ట్వీట్‌లో ప్రధాని మోదీ (PM Modi Tweet) పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు ప్రధాని ప్రకటించారు. పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ (PMNRF) నుంచి ఈ నిధులను కేంద్రం విడుదల చేసింది. కాగా అగ్నిప్రమాద మృతులకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సంతాపం తెలిపారు.

Here's PM Modi Tweet

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి విచారం

విజయవాడ దుర్ఘటనలో పలువురు మృతి చెందారని తెలిసి ఎంతో విచారించాను. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘‘ఈ ఘటన విచారకరం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ట్వీట్‌ చేశారు.

Here's President, Vice  President Tweets

సీఎం వైఎస్‌ జగన్‌కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ

అగ్నిప్రమాద ఘటనపై వివరాలు తెలుసుకోవడానికి ప్రధాని మోదీ ఆదివారం సీఎం వైఎస్‌ జగన్‌కు ఫోన్‌ చేశారు. ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌ ఓ హోటల్‌లో కరోనా పేషెంట్లను ఉంచిందని, తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించిందని ప్రధానికి సీఎం తెలిపారు. అధికారులు వెంటనే సహాయక చర్యలను చేపట్టారని, దురదృష్టవశాత్తూ కొంతమంది మరణించారని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా అధికారులను ఆదేశించామని ప్రధానికి చెప్పారు. ఈ విషయాన్ని వైయస్ జగన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘ఆప్తులను కోల్పోయిన వారి కుటుంబసభ్యులు, గాయపడిన వారి గురించి ప్రార్థిస్తున్నాను అని’’ ట్వీట్‌లో పేర్కొన్నారు.

విజయవాడలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలవగా, మరో 18 మంది గాయపడ్డారు. నగరంలోని రమేష్‌ ఆస్పత్రి.. ఏలూరు రోడ్డులో ప్రైవేట్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తున్న హోటల్‌ స్వర్ణ ప్యాలెస్‌లో (Hotel Swarna Palace) ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో మొత్తం 43 మంది ఉన్నారు. వీరిలో 31 మంది కోవిడ్‌ బాధితులు. వీరు కాకుండా ఆరుగురు చొప్పున మొత్తం 12 మంది హోటల్, ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు.

రిసెప్షన్‌లో ఉన్న పాత విద్యుత్‌ కేబుళ్ల నుంచి పొగలు వ్యాపించి మంటలు చెలరేగడమే ప్రమాదానికి కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి అరగంటలోనే మంటలను అదుపులోకి తేవడంతో పెనుముప్పు తప్పింది. పోలీసులు, జాతీయ విపత్తు దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌) సత్వరమే స్పందించి బాధితులను రక్షించి గాయపడ్డవారిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. విజయవాడ సెంట్రల్‌ కార్యాలయ తహసీల్దార్‌ జయశ్రీ ఫిర్యాదు మేరకు గవర్నర్‌పేట పోలీసులు రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం, హోటల్‌ యాజమాన్యంపై 304(2), 308 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.