Tirupati, August 10: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో కరోనా పంజా విసురుతోంది. ఇప్పటికే పలువురు అర్చకులు, అధికారులు కరోనా (COVID-19 in Tirumala) బారినపడిన విషయం తెలిసిందే. కాగా జూన్ 11 నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, జూన్ 11 నుంచి ఇప్పటి వరకు 743 మంది(అర్చకులు, టీటీడీ సిబ్బంది) కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని డయల్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనీల్ కుమార్ సింగ్ వెల్లడించారు.
743 మందిలో 402 మంది ఇప్పటివరకు కోలుకున్నారని, 338 మంది టీటీడీ (Tirumala Tirupati Devasthanams) సిబ్బంది చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. తిరుమలలో కేవలం ముగ్గురు ఉద్యోగులు మాత్రమే కరోనా బారిన పడి మరణించారని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శనాలతోనే తాము జూన్ 11 నుంచి శ్రీవారి దర్శనాలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. శ్రీనివాసమ్, విష్ణునివాసం, మాధవమ్ లను అక్కడ కరోనా కేంద్రాలుగా మార్చారు. దేశంలో తాజాగా 62,064 కేసులు నమోదు, 22 లక్షలు దాటిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు, యాక్టివ్‌గా 6,34,945 కేసులు, మరణాల సంఖ్య 44,386
ఒక్క తిరుపతిలోనే కరోనా కేసులు లేవని, రాష్ట్రం, దేశంలో కేసులు ఎక్కువగానే ఉన్నాయన్నారు. జులైలో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చినవారి సంఖ్య 2.38 లక్షల మంది భక్తులకు చేరింది. ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లాలో 848 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం పాజివ్ కేసుల సంఖ్య 17,097కు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 10,080 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 2,17,040కు చేరిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 1900 దాటిన కరోనా మరణాలు
7084 యాక్టివ్ కేసులున్నాయి. 9842 మంది కోలుకున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే .తాజాగా, 10,820 కొత్త కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 87,112 ఉణ్నాయి. 1,38,712 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 2036 మంది కరోనా బారిన పడి మరణించారు.