NTR Anna Canteens Menu: అన్న క్యాంటీన్లలో రోజు వారీ మెనూ ఇదిగో, నేటి నుంచి 5 రూపాయలకే భోజనం, టిఫెన్ ప్రారంభం
Gudiwada, August 15: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు అన్న క్యాంటీన్ లో భోజనాలు వడ్డించారు. పేదలతో కలిసి భోజనం చేశారు. పేదలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. నిరుపేదలకు 5 రూపాయలకే భోజనం పెట్టే అన్న క్యాంటీన్ ను పునరుద్ధరించడం సంతోషంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తాము కూడా టోకెన్ తీసుకుని భోజనం చేశారు.
అన్న క్యాంటీన్లకు సంబంధించి మెనూ వచ్చేసింది. అక్కడ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్ అందుబాటులో ఉంచుతారు. వారంలో ఆరు రోజులు ఈ క్యాంటీన్లు నడుస్తాయి.. ఆదివారం మాత్రం సెలవు దినం. టిఫిన్, భోజనం రూ.5కే అందిస్తారు. ప్రతి ఒక్కరం బతికేది జానెడు పొట్టకోసమే, అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు, ఇంకా ఏమన్నారంటే..
బ్రేక్ ఫాస్ట్ ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. లంచ్ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటుంది. డిన్నర్ రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఇడ్లీ, పూరి-3, ఉప్మా, పొంగల్-250 గ్రాములు, వైట్ రైస్ - 400 గ్రాములు, చట్నీ/పొడి - 15 గ్రాములు, సాంబారు- 150 గ్రాములు, మిక్చర్ - 25 గ్రాములు, కూర - 100 గ్రాములు, పప్పు/సాంబారు - 120 గ్రాములు, పెరుగు- 75 గ్రాములు అందిస్తారు.
అన్న క్యాంటీన్లలో మెనూ
సోమవారం
బ్రేక్ ఫాస్ట్ రూ.5
ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా పూరి, కుర్మా
లంచ్/డిన్నర్ రూ.5
వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి
మంగళవారం
బ్రేక్ ఫాస్ట్
ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా ఉప్మా, చట్నీ/పొడి, సాంబార్, మిక్చర్
లంచ్/డిన్నర్
వైట్ రైస్, కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి
బుధవారం
బ్రేక్ ఫాస్ట్
ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా పొంగల్, చట్నీ/పొడి, సాంబార్, మిక్చర్
లంచ్/డిన్నర్
వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు పచ్చడి
గురువారం
బ్రేక్ ఫాస్ట్
ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా పూరి, కుర్మా
లంచ్/డిన్నర్
వైట్ రైస్, కూర, పప్పు/సాంబారు, పెరుగు, పచ్చడి
శుక్రవారం
బ్రేక్ పాస్ట్
ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా ఉప్మా, చట్నీ/పొడి, సాంబారు, మిక్చర్
లంచ్/డిన్నర్ట్ రైస్, కూర, పప్పు/
వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి
శనివారం
బ్రేక్ ఫాస్ట్
ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబారు లేదా పొంగల్, చట్నీ/పొడి, సాంబారు, మిక్చర్
లంచ్/డిన్నర్
వైట్ రైస్, కూర, పప్పు/సాంబారు, పెరుగు, పచ్చడి