CM Jagan Slams Chandrababu: జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్‌ ఎజెండా, చంద్రబాబును జాకీ పెట్టి లేపేందుకు స్టార్ క్యాంపెయినర్లు తెగ కష్టపడుతున్నారని సెటైర్లు

పక్క పార్టీల్లోనూ స్టార్‌ క్యాంపెయినర్‌లు ఉన్నారని.. మంచినే నమ్ముకున్న తనకు అలాంటి వాళ్ల అవసరం ఏమాత్రం లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM Jagan Mohan Reddy) స్పష్టం చేశారు.

Chandrababu and Jagan and Pawan Kalyan (Photo-FB)

Uravakonda, Jan 23: మంగళవారం ఉరవకొండలో వైఎస్సార్‌ ఆసరా నిధుల జమ (YSR Asara Program in Uravakonda) కార్యక్రమంలో పాల్గొన్న CM Jagan ప్రతిపక్షాల కూటమి రాజకీయంపై విసుర్లు విసిరారు. ఏనాడూ మంచి చేయని చరిత్ర ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు కోసం పక్క రాష్ట్రం.. పక్క పార్టీల్లోనూ స్టార్‌ క్యాంపెయినర్‌లు ఉన్నారని.. మంచినే నమ్ముకున్న తనకు అలాంటి వాళ్ల అవసరం ఏమాత్రం లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM Jagan Mohan Reddy) స్పష్టం చేశారు.

ఏమీ చేయని వారికి, చెడు మాత్రమే చేసిన చరిత్ర ఉన్న వారికి, చంద్రబాబుకు, ఆయన ఎల్లో మీడియాకు, ఆయన గజదొంగల ముఠా, ఆయనకు తోడు ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి, టీవీ5, వీళ్లందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. రోజూ ఇలాంటి వారికి సమాధానం ఇవ్వాల్సి రావడమే నిజంగా కలికాలం అనిపిస్తుంది. ప్రతి ఇంట్లోనూ జరిగిన మంచి కనిపిస్తోంది. అయినా రోజూ అబద్ధాలతో వార్తలు వండి వారుస్తున్నారని మండిపడ్డారు.

వివక్షకు, లంచాలకు ఏపీలో చోటు లేదు, ప్రతి పథకం రాష్ట్రంలో పక్కాగా అమలవుతోంది, వైఎ­స్సార్‌ ఆసరా నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవిగో..

ఏ మంచీ చేయకపోయినా, ఏ స్కీములూ ఆయన అమలు చేయకపోయినా కూడా కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ చంద్రబాబుకేమో స్టార్‌ క్యాంపెయినర్లు దండిగా మంది ఉన్నారు. బాబు కోసం చంద్రబాబును భుజానికెత్తుకొని మోసే ముఠా. చాలా మంది ఉన్నారు. మన రాష్ట్రంలో ఎవరూ ఉండరు. వాళ్లు ఇళ్లు, కాపురాలు,సంసారాలు పక్క రాష్ట్రంలో ఉంటాయి.

పక్క రాష్ట్రంలో పర్మినెంట్‌ రెసిడెంట్‌గా ఉన్న దత్తపుత్రుడు స్టార్‌ క్యాంపెయినర్‌ అయితే, చంద్రబాబు వదినగారు.. ఆమె పక్కపార్టీలోకి వెళ్లి చంద్రబాబుకు మరో స్టార్‌ క్యాంపెయినర్‌. ఆయన వదిన అంటే అందరికీ తెలిసే ఉంటుంది. పక్క రాష్ట్రంలో శాశ్వతంగా ఉంటున్న ముగ్గురు మీడియా అధిపతులు. అక్కడున్న ఆ మీడియా అధిపతులు ఓ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5. వీళ్లంతా బాబుకు స్టార్‌ క్యాంపెయినర్లే.

ఇకపై జగనన్న గారూ అనే పిలుస్తానని తెలిపిన షర్మిల, రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధిని చూసేందుకు సిద్ధమని సవాల్, వీడియోలు ఇవిగో..

వీళ్లు కాక రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతున్న ఇంకొంత మంది స్టార్‌ క్యాంపెయినర్లు.. వీళ్లంతా చంద్రబాబుకు తోడుగా ఉన్నారు. బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్న.. అది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్న పసుపు కమలాలన్నీ కూడా ఇంకొంత మంది బాబుకు స్టార్‌ క్యాంపెయినర్లు ఉన్నారు.

అమరావతిలో బాబు భూములకు బినామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ, ఇతర పార్టీల్లోనూ రకరకాల రూపాల్లో చంద్రబాబుకు బినామీలు ఇప్పటికీ స్టార్‌ క్యాంపెయినర్లుగా కొనసాగుతున్నారు. టీవీలు ఆన్‌ చేస్తే విశ్లేషకుల పేరిట కనిపిస్తారు, వేదికల పేరు మీద, మేధావులు అని చెప్పుకుంటూ కనిపిస్తారు. రక రకాల స్టార్‌ క్యాంపెయినర్లు బాబు కోసం పని చేస్తారు. దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడంలో వీళ్లందరూ భాగస్వాములే.

ఏ అభివృద్ధీ చేయని వారికి, ప్రజలకు ఏ మంచీ చేయని వారికి, ప్రజలకు మోసాలే చేసిన వారికి ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం చేసిన వారికి ఇంత మంది స్టార్‌ క్యాంపెయినర్లు ఉన్నారు గానీ, ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, ప్రతి పేద ఇంటికీ మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్‌ క్యాంపెయినర్లూ లేరు. కానీ మీ బిడ్డ వీళ్లందరినీ నమ్ముకోలేదు.

వీళ్లందరికీ ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాడు. వీళ్లందరికన్నా ఎక్కువ స్టార్‌ క్యాంపెయినర్లు మీ బిడ్డకు ఉన్నారని చెప్పడానికి సంతోషపడుతున్నాడు. మీ బిడ్డకు స్టార్‌ క్యాంపెయినర్లు ఎవరో తెలుసా? ఈ జెండాలు జతకట్టిన వారంతా అనుకుంటున్నారు.. మీ బిడ్డకకు స్టార్‌ క్యాంపెయినర్లు లేరని.. వారికీ నాకూ తేడా ఏమిటో తెలుసా? కుట్రలు, కుతంత్రాలతో జెండాలు జతకట్టడమే వారి ఎజెండా.. జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్‌ ఎజెండా.. కాబట్టే వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్‌ క్యాంపెయినర్లు, దేశ చరిత్రలోనే కాదు.. రాజకీయ చరిత్రలోనే ఎవరూ ఉండరని ఈ సందర్బంగా తెలియజేస్తున్నా.

మీ బిడ్డకు స్టార్‌ క్యాంపెయినర్లు.. ఆ మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లూ.. ఆ ప్రతి ఇంట్లో ఉన్న నా అక్కచెల్లెమ్మలందరూ మీ బిడ్డకు స్టార్‌ క్యాంపెయినర్లే. ఒక వైయస్సార్‌ ఆసరా అందుకున్న నా అక్కచెల్లెమ్మలంతా 80 లక్షల మంది అక్కచెల్లెమ్మలు మీ బిడ్డకు స్టార్‌ క్యాంపెయినర్లే. సున్నావడ్డీ అందుకున్న కోటి మందికిపైగా మీ బిడ్డకు స్టార్‌ క్యాంపెయినర్లే. 57 లక్షల మంది తల్లులు, కోటికిపైగా ఉన్న ఆ పిల్లలు వీళ్లంతా కూడా మీ బిడ్డకు స్టార్‌ క్యాంపెయినర్లే. చేయూత అందుకున్న 31 లక్షల మంది నా అక్కచెల్లెమ్మలు వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్‌ క్యాంపెయినర్లే.

31 లక్షల మంది ఇళ్ల పట్టాలందుకున్న నా అక్కచెల్లెమ్మలు, వాళ్ల కుటుంబాలు, అందులో 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న ఈ కుటుంబాలన్నీ కూడా మీ బిడ్డకు స్టార్‌ క్యాంపెయినర్లే. రైతు భరోసా అందుకుంటున్న అరకోటికిపైగా ఉన్న 52 లక్షల మంది ఆ రైతన్నలందరూ మీ బిడ్డకు స్టార్‌ క్యాంపెయినర్లే. నెలనెలా పెన్షన్లు అందుకుంటున్న 65 లక్షల మంది నా అవ్వాతాతలు, నా వికలాంగులు, వికలాంగ సోదరులు, అక్కచెల్లెమ్మలు, వితంతు అక్కచెల్లెమ్మలు వీళ్లందరూ మీ బిడ్డకు స్టార్‌ క్యాంపెయినర్లేనని సీఎం జగన్ అన్నారు.