Andhra Pradesh: జగనన్నకు చెబుదాం కార్యక్రమ సన్నాహాలపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్, అర్జీల పరిష్కారంలో అనుసరించాల్సిన విధానాలపై సమగ్ర చర్చ

ఏపీలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం సన్నాహకాలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. వినతులను సంతృప్తస్థాయిలో పరిష్కరించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. స్పందన కార్యక్రమంలో భాగంగా అత్యధిక అర్జీలు అందుకుంటున్న ప్రభుత్వ విభాగ అధిపతులతో సీఎం సమీక్షించారు

YS Jagan (Photo-Twitter)

Amaravati, Feb 3: ఏపీలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం సన్నాహకాలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. వినతులను సంతృప్తస్థాయిలో పరిష్కరించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. స్పందన కార్యక్రమంలో భాగంగా అత్యధిక అర్జీలు అందుకుంటున్న ప్రభుత్వ విభాగ అధిపతులతో సీఎం సమీక్షించారు. అర్జీల పరిష్కారంలో అనుసరించాల్సిన విధానాలపై సమగ్ర చర్చ జరిగింది.

ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే..:

♦జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభానికి అధికారులు సన్నద్ధం కావాలని ఆదేశించిన సీఎం

♦ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రి.

♦ప్రతి ప్రభుత్వ విభాగాధిపతి ప్రతి వినతిని పరిష్కారం అయ్యేంతవరకూ ట్రాక్‌ చేయాలి

♦అందిన అర్జీలపై ప్రతి వారం కూడా ఆడిట్‌ చేయాలి. దీనిపై ప్రతి వారం కూడా నివేదికలు తీసుకోవాలి

♦ట్రాకింగ్, పర్యవేక్షణ జరుగుతుందా? లేదా? అన్నదానిపై ప్రతివారం కూడా సమీక్ష చేయాలి

♦అలా అయితేనే.. కార్యక్రమం సవ్యంగా సాగుతుంది

ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్, వంకరకుంట నుండి ఓదులపల్లి వరకు 6-లేన్ రహదారికి ఆమోదం, ట్విట్టర్ ద్వారా తెలిపిన మంత్రి గడ్కరీ

♦వివిధ ప్రభుత్వ విభాగాల్లో అర్జీలు, ఫిర్యాదుల స్వీకరణకు ఇప్పటికే ఉన్న కాల్‌ సెంటర్లను అనుసంధానం చేయాలి

♦వివిధ విభాగాల్లో వినతుల పరిష్కారం కోసం ఇప్పటివరకూ ఉన్న పద్ధతులను మరోసారి పరిశీలించి, తిరిగి పునర్నిర్మాణం చేయాలి

♦సీఎంఓతోపాటు ప్రతి ప్రభుత్వ శాఖలో కూడా జగనన్నకు చెబుదాం ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ విభాగాలు ఉండాలి. తర్వాత జిల్లాస్థాయిలోనూ, మండలస్థాయిలో కూడా ప్రాజెక్టు మానిటరింగ్‌ యూనిట్స్‌ ఏర్పాటు చేసుకోవాలి.

♦ఇలాంటి మానిటరింగ్‌ యూనిట్లు మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల స్థాయిలో కూడా ఉండాలి

♦మానిటరింగ్‌ యూనిట్లు సమర్థవంతంగా పనిచేస్తేనే కార్యక్రమం బాగా జరుగుతుంది

♦స్పందనకు అత్యంత సమర్థవంతమైన, మెరుగైన విధానమే ‘‘ జగనన్నకు చెబుదాం’’

♦సంబంధిత విభాగంలో సరిగ్గా పని జరగలేదనే కారణంతోనే వినతులు, ఫిర్యాదులు వస్తాయి. ఇలాంటి సందర్భాల్లో వారిని సంతృప్తి పరిచేలా పరిష్కారం చూపడం అన్నది సవాల్‌తో కూడుకున్నది

♦సహనం, ఓపిక, పునఃపరిశీలన, విధానాల పునర్నిర్మాణాలతో ముందుకు సాగాలి

♦స్పందన డేటా ప్రకారం అత్యధికంగా ఫిర్యాదులు రెవిన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, హోంశాఖ, ఆరోగ్యం–కుటుంబ సంక్షేమ శాఖల నుంచి వస్తున్నాయి

♦జగనన్నకు చెబుదాం ప్రారంభమైన తర్వాత ఇవే విభాగాలనుంచి వినతులు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి

♦ఈ శాఖలకు చెందిన విభాగాధిపతులు అర్జీల పరిష్కారంపై మరింత దృష్టిపెట్టాల్సి ఉంటుంది

♦జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై సిబ్బందికి ఓరియెంటేషన్‌ ఇవ్వాలి

♦మానిటరింగ్‌ యూనిట్లు ఏర్పాటుపైకూడా మార్గదర్శకాలు రూపొందించాలి

♦నిర్దేశిత సమయంలోగా వినతులు పరిష్కారం కావాలి

♦ఆ సమయంలోగా పరిష్కారం కావడం, పరిష్కారంలో నాణ్యత ఉండడం అన్నది చాలా ముఖ్యం

♦పరిష్కారం అయిన తర్వాత వినతులిచ్చిన వారి నుంచి లేఖ తీసుకోవాలి

♦పలానా అర్జీని తిరస్కరించాల్సిన నేపథ్యంలో అక్కడ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి

♦తిరస్కరణకు గురైనా జరిగిన ప్రక్రియపై అర్జీదారులు సంతృప్తి వ్యక్తం చేసేలా ఉండాలి

♦అవినీతికి సంబంధించి అంశాలను చాలా గట్టిగా తీసుకోవాలని సీఎం ఆదేశం

♦తప్పు చేయడానికి భయపడే పరిస్థితి ఉండాలి

♦పోలీసులకు వచ్చే అర్జీల పరిష్కారానికి మండల స్థాయిలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం

♦పోలీసులు, రెవిన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్‌ అధికారులతో కూడిన మండల, మున్సిపల్‌ స్ధాయి సమన్వయ కమిటీ ప్రతివారం సమావేశం కావాలి

♦వారంలో ఒకరోజు సమావేశమై అర్జీల పరిష్కారంపై దృష్టిపెట్టాలని ఆదేశం:

♦ప్రభుత్వ విభాగాధిపతులు త్వరలో కలెక్టర్లతో సమావేశం నిర్వహించి.. వారికీ అవగాహన కల్పించాలి

ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్‌ గుప్తా, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్, సెర్ఫ్‌ సీఈఓ ఏ ఎం డి ఇంతియాజ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement