AP New Districts Row: ఏపీలో ఉగాది నాటికి కొత్త జిల్లాలు, ఇప్పుడున్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలే కొత్త జిల్లాలకు వెళ్లాలని సీఎం జగన్ ఆదేశాలు, సన్నాహకాలు పూర్తి చేయాలని అధికారులకు సూచన

ఈ మేరకు సన్నాహకాలు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాల పునర్విభజనపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సీఎం (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) గురువారం సమీక్ష చేపట్టారు.

CM YS Jagan (Photo-Twitter/AP CMO)

Amaravati, Feb 10: ఉగాది నాటికి కొత్త జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు కార్యకలాపాలు సాగించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సన్నాహకాలు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాల పునర్విభజనపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సీఎం (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) గురువారం సమీక్ష చేపట్టారు.

కొత్త జిల్లాల ప్రతిపాదనలు, ప్రాతిపదికలను సీఎంకు అధికారులు వివరించారు. కొత్త జిల్లాల మ్యాపులు, జిల్లా కేంద్రాల నిర్ణయం వెనుక తీసుకున్న ప్రాధాన్యతలను వివరించారు. అలాగే ప్రతిపాదనలపై వస్తున్న అభ్యంతరాలు, సలహాలు, సూచనలు కూడా నిశితంగా పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు.

కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత... యంత్రాంగం అంతా సమర్థవంతంగా పనిచేయాలr. కొత్త జిల్లాలో (new Districts before Ugadi) పని ప్రారంభమైన తర్వాత ఎలాంటి అయోమయం ఉండకూడదు, పాలన సాఫీగా ముందుకు సాగాలి. దీనికోసం సన్నాహకాలను చురుగ్గా, వేగంగా, సమర్థవంతంగా మొదలు పెట్టాలని సీఎం తెలిపారు. ఉద్యోగుల విభజన, మౌలిక సదుపాయాల ఏర్పాటు, కొత్త భవనాలు వచ్చేలోగా యంత్రాంగం పనిచేయడానికి అవసరమైన భవనాల గుర్తింపు.. అన్నిరకాలుగా కూడా సిద్ధం కావాలన్నారు.

సినీ పరిశ్రమకు అండగా ఉంటాం, సినీ పరిశ్రమ సమస్యలపై కమిటీ కూడా వేశామని తెలిపిన మంత్రి పేర్ని నాని, సీఎం జగన్‌తో ముగిసిన సినీ ప్రముఖులు భేటీ

కొత్తగా మౌలిక సదుపాయాలు ఏర్పాటయ్యేలోగా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు కావాల్సిన భవనాలు తదితర వాటిని గుర్తించాలి. అలాగే కొత్త భవనాల నిర్మాణంపైనా ప్రణాళికలను ఖరారు చేయాలి. అందుకోసం స్థలాల గుర్తింపుపై దృష్టిపెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.

దుబాయ్ ఎక్స్ పోలో ఏపీ ప్రత్యేకతను చాటుతాం, రేపు దుబాయిలో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ను ప్రారంభించనున్న ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి

ఇప్పుడున్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలనే కొత్త జిల్లాలకు పంపాలని సీఎం ఆదేశించారు. వీరికున్న అనుభవం కొత్త జిల్లాలకు (new Districts ) ఉపయోగపడుతుందన్న సీఎం..వీరు కొత్త జిల్లాల్లో మౌలికసదుపాయాలు, పాలన సాఫీగా సాగేందుకు వీలుగా సన్నాహకాలను పరిశీలిస్తారని తెలిపారు. స్థానిక సంస్థల (జిల్లాపరిషత్‌ల విభజన) విషయంలో కూడా అనుసరించాల్సిన విధానాన్ని న్యాయపరంగా, చట్టపరంగా పరిశీలించి తగిన ప్రతిపాదనలు తయారుచేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు.

ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.



సంబంధిత వార్తలు