Dubai Expo2020 (మేకపాటి గౌతం)

అమరావతి, ఫిబ్రవరి, 10 : దుబాయ్ ఎక్స్ పోలో ఏపీ ప్రత్యేకతను చాటేందుకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం సిద్ధమైంది. విదేశీ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో పయణమవుతోంది. 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ జరిగే దుబయ్ ఎక్స్ పోలో పలు కంపెనీలతో పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకునే దిశగా కార్యాచరణ పూర్తి చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ పాలనలో సులభతర వాణిజ్యం, సకల సదుపాయాలతో పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ స్వర్గధామమని దేశ, విదేశాల నుంచి తరలివచ్చే పారిశ్రామిక వేత్తలకు రాష్ట్ర గళం వినిపించేందుకు సమాయత్తమైంది. మల్టీ మోడల్ టాజిస్టిక్ పార్కులు, తయారీ రంగం, పోర్టుల అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్లు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, విద్య, వైద్య, పర్యాటక రంగాలలో పెట్టుబడులకు ఏపీలో గల పుష్కలమైన అవకాశాలను దుబాయ్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతను ప్రదర్శించనుంది.

11న ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ను ప్రారంభించనున్న పరిశ్రమల శాఖ మంత్రి

పరిశ్రమల శాఖ మంత్రి 11వ తేదీన దుబాయ్ కి పయనమవుతుండగా ఇప్పటికే ఈడీబీ, ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖ అధికారులు ఇప్పటికే బృందాలుగా చేరుకున్నారు. ఇండియన్ పెవిలియన్ భవంతిలోని రాష్ట్రానికి కేటాయించిన ప్రాంగణంలో ఏపీ పెవిలియన్ ని రాష్ట్ర పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసింది. 11న ఈ పెవిలియన్ ని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి యూఏఈ విదేశీ వాణిజ్య శాఖ మంత్రి హెచ్.ఈ అహ్మద్ అల్బానా, భారతదేశానికి చెందిన యూఏఈ రాయబారి సంజయ్ సుధీర్, ఇండియాకి సంబంధించిన యూఏఈ రాయబారి జుల్ఫీ రావ్ద్జీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు, ఇతర దేశాల్లోని ప్రభుత్వ ప్రతినిధులతో కలిసి లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఐఎస్ఐస్ అగ్ర‌నేత ఖురేషీని హతం చేసిన అమెరికా దళాలు, నార్త్ వెస్ట్ సిరియాలో అల్ ఖురేషీని మ‌ట్టుబెట్టామని తెలిపిన జోబైడెన్

13వ తేదీన ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ఉట్టిపడేలా సంప్రదాయ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ అంటే ప్రత్యేక సంస్కృతి సంప్రదాయాల పుట్టినిల్లు. కళలకు నిలయం. ప్రత్యేక నైపుణ్యాలకు చిరునామా. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో సంప్రదాయ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించబోతుంది. దేశ, విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు, వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులకు ఏపీ గురించి తెలిసే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తద్వారా అతిథులకు ఆహ్వానం పలకనున్నారు.

ఎక్స్‌పోలో రాష్ట్ర ప్రతినిధి బృందం సమక్షంలో, శ్రీరెడ్డి నేతృత్వంలోని అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందం దుబాయ్ , అబుదాబిలో జరిగే వివిధ వాణిజ్య సమావేశాలకు హాజరవుతుంది, UAEలోని అగ్ర కార్పొరేషన్‌లతో సంభావ్య సహకారం దిశగా కలిసి అడుగులు వేయనుంది. రాష్ట్రంలోని వివిధ రంగాలలోని అవకాశాల గురించి చర్చించనుంది. యుఎఇతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ ప్రతినిధి బృందం వివిధ పరిశ్రమల సంఘాలను కూడా కలుస్తుంది. ద్వైపాక్షిక సమావేశాలనూ నిర్వహిస్తుంది. 11వ తేదీ ఇండియా పెవిలియన్‌లో ప్రారంభమై 17 ఫిబ్రవరి 2022న ముగియనుంది.